కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామితో ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా కుమార స్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పరమేశ్వర (67) ప్రమాణ స్వీకారం చేశారు. అటు ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇటు ఉపముఖ్యమంత్రి పరమేశ్వర ఇద్దరూ తమ మాతృబాష కన్నడలో ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సహాంతో ఈలలు, కేకలు వేశారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులిద్దరూ విద్యావంతులే. బీఎస్సీ పట్టాను అందుకున్న కుమారస్వామి 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి.. 2006లోనూ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, పీహెచ్‌డీ పట్టా పొంది అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన పరమేశ్వర ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆయనకు గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
కాగా, వీరిద్దరితో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్, కేరళ, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కేజ్రీవాల్‌తో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ ముఖ్య నేతలు సహా పలువురు హాజరయ్యారు.
కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తైన తరువాత వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, అభిమానులకు వందనం చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఇంతలోనే రాహుల్ గాంధీ వేదిక నుంచి వెళ్తున్న క్రమంలో చంద్రబాబు వద్దకు వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం... ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశాన్ని ఆవిష్కరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more