జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీయేతర పార్టీలన్నీ ఆద్యంతం ఉత్సాహంగా కనిపించాయి. తమ బలప్రదర్శనకు ఇది చక్కని వేదికగా నిలిచిందని కూడా ఆయా పక్షాలన్ని సంతోషంగా కనిపించాయి. 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ప్రమాణ స్వీకార వేదికపై కనిపించింది. బీజేపీ యేతర పార్టీ నాయకులతో వేదిక నిండిపోయింది. అయితే, ఇదే కార్యక్రమానికి హాజరైన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం వేదిక వద్దకు వచ్చీ రాగానే కొంత అసహనానికి గురయ్యారు. ఎందుకుని అంటారా..?
అమె తన కారులో బెంగుళూరులోని విధాన సౌధా అసెంబ్లీకి చేరుకునేందుకు వస్తుండగా, తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విధానసౌదకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రముఖలు హాజరుకావడంతో వారి వాహనాలతో అసెంబ్లీ ప్రాంగణమంతా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. దీంతో తాను కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సమాయానికి చేరుకుంటానా.? లేదా.? అన్న అనుమానంతో అమె కారు దిగి కొంత దూరం నడుచుకుంటూ విధానసౌధకు చేరుకున్నారు. దీంతో అమె వేదిక వద్దకు వచ్చి రాగానే ట్రాపిక్ జామ్ విషయమై కర్ణాటక డీజీపీ నీలమణి రాజుతో ఈ సమస్యపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏంటీ ఏర్పాట్లు? ఎంత మంది ప్రముఖులు వస్తున్నారన్న విషయమై సమాచారం లేదా.? ఉన్నప్పుడు వారి వాహనాలకు అంతరాయం కలగకుండా నేరుగా వేదికకు చేరుకునేలా ఏర్పాటు చేయలేరా.? అంటూ చీవాట్లు పెట్టారు. ఆమె ఆగ్రహాన్ని చూసి కుమారస్వామి, దేవెగౌడ, ఇతర నేతలు బిత్తరపోయారు. ప్రమాణస్వీకారం కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్న మమత నేరుగా విధానసౌధకు బయలుదేరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు, కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు హాజరుకావడంతో ఆమె వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఎదురయ్యాయి. డీజీపీపై మమత ఆగ్రహానికి ఇదే కారణమని చెబుతున్నారు. పోలీస్ బాస్‌పై ఫైర్ అవుతున్న మమత వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
#WATCH: West Bengal CM Mamata Banerjee reprimands DIG Neelamani Raju as she came to Karnataka Vidhana Soudha for oath taking ceremony because reportedly had to walk a few metres, also expressed discontentment to HD Deve Gowda & HD Kumaraswamy. #Bengaluru pic.twitter.com/WZ2n0QVE9b
— ANI (@ANI) May 23, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more