టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పదేళ్ల పాటు అధికారానికి చేసిన తప్పునే మళ్లీ పునారావృతం చేస్తున్నారని, రాష్ట్రం అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే అభివృద్దిని పరిమితం చేస్తే.. అభివృద్ది చెందన ప్రాంతాలు అన్ని కలసి మాకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని తెలంగాణ మాదిరిగా డిమాండ్ చేసే అవకాశాలున్నాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇలాగే హైదరాబాద్ చుట్టూ అభివృద్ది చేసి.. తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు దోహదం చేశారని పవన్ విమర్శించారు.
ఇక ఇప్పుడు అమరావతి, విజయవాడ, గుంటూరులోనే అభివృద్ధి చేస్తూ మరో కలింగ రాష్ట్ర పోరాటానికి కూడా చంద్రబాబు విధానాలే కారణం అవుతున్నాయిని అన్నారు. మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలుతుందని, ఇతర ప్రాంతాలను పట్టించుకోకపోతే రాష్ట్రం రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలవుతుందని పవన్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని కురుప్పాంలో నిర్వహించిన కవాత్తు ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ... అక్కడ తెలంగాణ మాదిరిగానే ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉదని అన్నారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనతో సొంత రాష్ట్రంలో పరాయివాళ్లమైన పరిస్థితి వచ్చిందనన్నారు. దీంతో అక్కడి అందోళనల నేపథ్యంలో సొంతప్రాంతాలకు రావాలని చూస్తే ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు లేవు.. ప్రవేటులో చేద్దామా అంటే పరిశ్రమలు లేవు.. సర్లే భూమిని సాగుచూస్తూ బతికేద్దామంటే సాగునీరు లేదు.. కనీసం తోటపల్లి, జంజావతి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా నిధులు లేవు. ఉత్తరాంధ్ర అంటే ఇంతటి నిర్లక్ష్యమా.? అంటూ ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థలో మాజీ ఉధ్యోగికి రూ. 500 కోట్ల ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు వుంటాయ్.. కానీ రూ. 269 కోట్ల ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఇవ్వాలంటే నిధులు వుండవా.? అంటూ ప్రశ్నించారు.
ఉద్ధానం సమస్యను రాష్ట్రంలోని ప్రజలతో పాటు అందరికీ తెలిసేలా వెలుగులోకి తీసుకువచ్చింది జనసేన పార్టీ వల్లనేనన్నారు. జనసేన లేకపోతే ఈ సమస్య ఇప్పటికీ అలాగే వుండేదని అన్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన జనసేన.. ఇంత చేయగలిగినప్పుడు ఇన్నేళ్లుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని ఆయన నిలదీశారు. ఉద్దానం తరహాలోనే విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలంలో పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధి స్వైరవిహారం చేస్తుందన్నారు. ఇక్కడ దోమలు అధికంగా వుండటం వల్ల ఇక్కడి వారు వ్యాధి భారిన పడుతున్నారని అన్నారు.
వందల కుటుంబాలు ఈ వ్యాధి బారిన పడి.. నయం చేసుకోలేని పరిస్థుల్లోకి నెట్టివేయబడ్డాయని అన్నారు. అయితే ఈ వ్యాధి నిర్మూలణకు ఇక్కడ ఒక ఫైలీరియా పరిశోధన కేంద్రం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా.. పట్టించుకునేందుకు మన రాష్ట్ర పభుత్వంలో ఒక అరోగ్యశాఖ మంత్రి లేరని, అన్నారు. ఇక చంద్రబాబు హామీలు చూస్తుంటే.. రోగాలను నయం చేసేందుకు దారి చూపండీ అంటే.. సింగపూర్ తరహా అభివృద్ది చేస్తా.. 21వ శతాబ్ధానికి తీసుకువెళ్తా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more