2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు ఇన్నాళ్లు దూరంగా వుంచిన పార్టీ సీనియర్ నేతలను ఓ వైపు దగ్గరకు చేర్చకుంటూ.. వారే ఇక పార్టీని ముందుకు నడిపించాలని అభ్యర్థిస్తున్న బీజేపి అధిష్టానం.. వారి సహకారంతో రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇందుకోసం 70 ఏళ్లు పైబడిన వ్యక్తులను ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని తీసుకున్న నిర్ణయాలను కూడా పక్కనబెట్టి ఇక వారు లేకపోతే గత్యంతరమే లేదని గ్రహించింది.
ఇక మరోవైపు మిత్రులను కూడా దరిచేర్చుకుంటుంది. నాలుగేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే వద్దకు వచ్చి భేటీ అయ్యి రానున్న ఎన్నికలలో ఎలా బరిలోకి దిగాలన్న విషయమై రెండు గంటల పాటు చర్చించారు. అయితే శివసేన మాత్రం అందుకు భిన్నంగా ప్రకటనను వెలువరించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని శివసేన మరోసారి స్పష్టంచేసింది.
ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఈ విషయం స్పష్టంచేశారు. వచ్చే అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే తీర్మానానికే తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. అమిత్ షా, ఉద్ధవ్ ఠాక్రే భేటీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇద్దరి మధ్యా రెండు గంటలపాటు చర్చలు సాఫీగా సాగాయి. అనేక విషయాలపై వారిద్దరూ చర్చించారు. అమిత్ షా ఎజెండా ఏమిటో మీడియాకు తెలుసు. శివసేన ఓ తీర్మానం చేసుకుంది. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని. మా పార్టీ తీర్మానంలో ఎలాంటి మార్పూ ఉండదు’’ అని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more