టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి సవాల్ ఎదుర్కోన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సవాల్ ను స్వీకరించిన కొంత కాలానికి తన ఫిట్ నెస్ ఛాలెంజ్ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. ప్రధాని తాను నిత్యం చేసే పంచతత్త్వాల వ్యాయామాలనే అచరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మేరకు తన ట్వీట్ లో ప్రధాని.. యోగాలో భాగమైన పంచతత్వాలు.. భూమి, నీరు, అగ్ని, వాయు, అకాశాలతో కూడిన వ్యాయామాలు అచరించడం వల్ల తనకు ఎంతో మానసిక ఉల్లాసం, ప్రేరణ కలుగుతుందని చెప్పారు. దీంతో పాటు తాను శ్వాససంబంధ వ్యాయామాలు కూడా అచరిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే క్యాప్షన్ పెట్టి మారీ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. విరాట్ కోహ్లీ చేసిన ఫిట్ నెస్ సవాలును స్వీకరించిన ప్రధాని తాజాగా ఈ సవాలును కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి సవాల్ విసిరారు. అయనతో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐఎఎస్ అధికారులనూ చాలెంజ్ చేశారు. కాగా, ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను మొదలు పెట్టింది మాత్రం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. ఆయన ఈ చాలెంజ్ కు తెరతీసి.. విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులకు ఛాలెంజ్ చేశారు. మోదీ వీడియోను మీరూ చూడవచ్చు.
Here are moments from my morning exercises. Apart from Yoga, I walk on a track inspired by the Panchtatvas or 5 elements of nature - Prithvi, Jal, Agni, Vayu, Aakash. This is extremely refreshing and rejuvenating. I also practice
— Narendra Modi (@narendramodi) June 13, 2018
breathing exercises. #HumFitTohIndiaFit pic.twitter.com/km3345GuV2
అయితే ఒక జట్టు కెప్టెన్ విసిరిన సవాలను స్వీకరించిన ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ సహా పలువరు విసిరిన సవాళ్లను మాత్రం స్వీకరించలేదు. దేశ ప్రధానిగా తాను ఫిట్ గా వుండటం మంచిదే కానీ.. దేశ ప్రజలు కూడా ఫిట్ గా వుండేలా చర్యలు తీసుకోవాలని, మరీ ముఖ్యంగా రైతాంగం అదోగతి పాలవుతున్న క్రమంలో వారిని సంక్షేమం ఫిట్ గా వుండేలా చర్యలు తీసుకోవాలని, యువతకు ఉపాధినిస్తే వారు ఫిట్ అవుతారని.. ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పాలనాపరంగా కూడా ఫిట్ గా వుండేలా.. చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతల సవాళ్లను ప్రధాని ఎప్పుడు స్వీకరించి.. ఎప్పుడు వాటిని అచరించి వీడియో అప్ లోడ్ చేస్తారో వేచిచూడాల్సిందే.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, తనను టార్గెట్ చేస్తూ ఫిట్ నెస్ చాలెంజ్ చేయడంపై కర్ణాటక సీఎం కుమారస్వామి వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ప్రియమైన నరేంద్రమోదీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అని వ్యాఖ్యానించారు.
Dear @narendramodi ji
— CM of Karnataka (@CMofKarnataka) June 13, 2018
I am honoured& thankU very much for d concern about my health
I believe physical fitness is imptnt for all&support d cause. Yoga-treadmill r part of my daily workout regime.
Yet, I am more concerned about devlpment fitness of my state&seek ur support for it.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more