తమిళనాడులోని అధికారపక్షం పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్న గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ విపక్షాలకు హెచ్చరిక సందేశాలను పంపారు. రాజ్యంగం గవర్నర్లకు కల్పించిన పలు విశేషాధికారాల నేపథ్యంలో తన రాష్ట్ర పర్యటనలు కొనసాగుతాయని, ఈ క్రమంలో తన పర్యటనలను అడ్డుకుంటామన్న విపక్ష నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు. ప్రభుత్వ విభాగాలను సమీక్షించడం తన విధి అని, తన పర్యటనల్లో నిరసనలు తెలిపినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా జైలుకు వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు.
రాజ్యాంగపరంగా గవర్నర్ కు కొన్ని విశేషాధికారాలు ఉంటాయని, వాటిని ఎవరూ అడ్డుకోకూడదని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124 కింద గవర్నర్ కు రక్షణ లభిస్తుందని, ఆయన్ను అడ్డుకునేందుకు చూస్తే, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొంది. తన పర్యటనలను అడ్డుకుంటామని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో రాజ్ భవన్ కార్యాలయం స్పందిస్తూ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరికలను జారీ చేసింది.
కాగా, రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ, ఆయన రాష్ట్ర గవర్నర్ గా కాకుండా పరిపూర్ణ రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపుతానని బెదిరించడాన్ని ఖండించారు. గవర్నర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేయడమంటే, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టేనని, గవర్నర్ పర్యటనల్లో నల్ల జెండాలతో నిరసనలు కొనసాగిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం నాడు గవర్నర్ నామక్కల్ లో పర్యటించగా, డీఎంకే శ్రేణులు నిరసనలు తెలిపిన వేళ, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more