kathi mahesh Gherao at TV studio in banjara hills కత్తి మహేష్ తో వాదనకు దిగిన భజరంగ్ దళ్ సభ్యులు..

Kathi mahesh gherao at tv studio in banjara hills

kathi mahesh, kathi mahesh Gheraod TV Studio, kathi mahesh bajarangdal, kathi mahesh hindu sanghs, Banjara Hills, chintala ramachandra reddy, DCP AR Srinivas, hyderabad police, crime

kathi mahesh, kathi mahesh Gheraod TV Studio, kathi mahesh bajarangdal, kathi mahesh hindu sanghs, Banjara Hills, chintala ramachandra reddy, DCP AR Srinivas, hyderabad police, crime

కత్తి మహేష్ తో వాదనకు దిగిన భజరంగ్ దళ్ సభ్యులు..

Posted: 07/02/2018 11:14 AM IST
Kathi mahesh gherao at tv studio in banjara hills

సినీ విమర్శకుడు కత్తి మహేష్.. హిందువుల ఆరాద్య దైవం శ్రీరాముడిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. ఓ టీవీ ఛానెల్ వద్ద ఆయన టీవీలో లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తున్న ఆయనను అడ్డుకుని హిందూ ధార్మిక సంఘాలతో పాటు భజరంగ్ దళ్ సభ్యులు వాదనకు దిగారు. తక్షణం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు భేషరుతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు భజరంగ్ ధళ్ సభ్యులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. దీంతో టీవీ ఛానెల్ వద్ద ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం కాస్తా.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు షిప్ట్ అయ్యింది. రంగంలోకి దిగిన ఖైరతాబాద్ బీజేపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అరెస్టు చేసిన భజరంగ్ ధళ్ కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని హైదరాబాద్ కమీషనరేట్ వెస్ట్ జోన్ డీసిపీ శ్రీనివాస్ సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles