జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేవి గుడి జంక్షన్ లో నిర్వహించిన సభలో ఆయన తెలంగాణలో స్థిరపడిన ఉత్తరాంధ్రవాసుల సమస్యపై తానే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుతో మాట్లాడుతానని పవన్ కల్యాన్ అన్నారు. ఉత్తరాంధ్రలోని 23 వెనకబడిన కులాలను కేసీఆర్ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని, దీనివల్ల హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఉత్తరాంధ్రుల సమస్యను టీడీపీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఇకపై ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు పవన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్నదే తన దృక్పధం అని అంతేకాని.. రాజకీయాలను కూడా కుహానా వ్యాపారంగా మార్చడం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారి ప్రభుత్వం ఇవ్వాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఐదేళ్లు అవకాశమిస్తే.. మళ్లీ మళ్లీ కావాలి, మీరే రావాలి అనేలా పనిచేస్తామని చెప్పారు.
అనంతరం ఆయన రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడి అందాలను తన స్మార్ట్‌ఫోన్‌లో బంధించారు. తాటిపూడి రిజర్వాయర్ నీటి కోసం విజయనగరం జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రిజర్వాయర్ చేరుకున్న పవన్ అక్కడే ఒక కొబ్బరిబోండాం తీసుకుని దానిని తాగుతూ, అక్కడున్న ప్రకృతి అందాలను తన స్మార్ట్ ఫోనులో బంధించి.. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. పవన్ కల్యాణ్‌ను కలవడానికి స్థానికులు ఉత్సాహం చూపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more