న్యూస్ పేపర్ చదవడం మంచి అలవాటు. ప్రతిరోజు అది వ్యసనంలా మారితే వారికి కరెంట్ అఫైర్స్ పై మంచి పట్టువుంటుంది. ఇక రాజకీయాలపై అవగాహన, పరిజ్ఞనం కూడా ఏమాత్రం ఖర్చులేకుండానే వచ్చేస్తాయి. అయితే ఉదయాన్నే కొందరు బాత్ రూమ్ లోనో, లేక వాకింగ్ చేస్తూనే చదివేస్తుంటారు. అయితే ఒక బస్ డ్రైవర్ మాత్రం బస్సును నడుపుతూనే పేపర్ చదవేస్తుండటం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రయాణికుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చి.. తాను మాత్రం పేపర్ చదువుతూ బస్సు నడపటమే ఇందుకు కారణమైంది.
అసలే ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతాయో తెలియకుండా జరుగుతన్న క్రమంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బస్సు డ్రైవర్.. తన నిర్లక్ష్యంతో ప్రయాణికుల ప్రాణాలను బలిపీఠంపై పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. డ్రైవర్ గా ఎంపికైన తరువాత వారికిచ్చే శిక్షణకాలంలో కూడా ఎన్నో జాగ్రత్తలు…మెళుకువలు నేర్పుతారు నిపుణులు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధులు నిర్వహించే డ్రైవర్లలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రయాణికులు చనిపోయారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ప్రయాణికుల భద్రత కోసం అధికారులు కటిన చర్యలు చేపడుతున్నా…కొందరు బస్ డ్రైవర్లలో మార్పు మాత్రం రావడం లేదు. సెల్ ఫోన్లలో మాట్లాడుతూ.. పక్కనే కూర్చున్న ప్యాసింజర్ తో ముచ్చటిస్తూ…లిమిట్ కు మించిన స్పీడ్ తో బస్సులను నడుపుతున్నారు. ఇది కాస్తా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం(జులై-1) ఆవడి నుంచి తిరువాన్‌మ్యూర్ వైపుగా కార్పొరేషన్ బస్సు(నెంబర్- 47D) వెళుతోంది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ అంబత్తూర్ ప్రాంతంలో వస్తుండగా పత్రికను స్టేరింగ్‌పై చదువుతూ బస్సు నడుపుతున్నాడు. ఇది చూసి ఆందోళన చెందిన ప్రయాణికులు అతన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తుంది. బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫోన్లో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. దీనిపై స్పందించిన ఆ రవాణ సంస్థ అధికారి… బస్సు అంబత్తూర్ బస్సు డిపోకి చెందిందని… డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more