దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు వేసిన పిటీషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించి.. వారికి కు ఉరి శిక్షే సరైందని తీర్పును వెలువరించిన క్రమంలో మరో హంతకుడు, కామాంధుడికి కూడా మద్రాసు హైకోర్టు అదే తీర్పును సరైందని తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ.. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్యచేసిన టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది.
వివరా్లోలకి వెళ్తే.. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాప్ట్ వేర్ ఉద్యోగి దశ్వంత్.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి…ఆ బాలిక మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు. పాప అచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులకు పాప శవం కనిపించడంతో గుండలవిసేలా రోధించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది.
కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడి సంబంధించిన కీలక అధారాలన్నింటినీ తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్ కోర్టు దశ్వంత్ కు ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దశ్వంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. దిగువ న్యాయస్థానం వెలువరించిన తీర్పును సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్కు ఉరిశిక్ష సరైనదే అంటూ తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more