Hike likely in price of Garib Rath tickets అమీరులకే గరీబ్ రథ్ రైలు టికెట్లు.. పెరగనున్న ధరలు

Railways may hike prices of beddings in garib rath express

railway, indian railways, garib rath, price hike Garib Rath, tickets, Garib Rath ticket hike, bedroll kits, garib, ameer, UPA, NDA, gujarat bullet train

Bedroll kits could soon be included in the ticket price of the Garib Rath Express, but it could cost significantly more with the railways considering a hike from the ₹25 fixed over a decade ago, senior officials said.

అమీరులకే గరీబ్ రథ్ రైలు ప్రయాణ టికెట్లు.. పెరగనున్న ధరలు

Posted: 07/16/2018 11:55 AM IST
Railways may hike prices of beddings in garib rath express

యూపీఏ హయంలో దూర ప్రయాణాలు చేసే పేదలకు త‌క్కువ ధ‌ర‌లో ఏసీ ప్ర‌యాణాన్ని అందించే యోచనతో అమలుపర్చిన గరీబ్‌ రథ్‌ ఎక్స్ ప్రెస్ రైలు ఇక వారికి క్రమంగా దూరం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయాలు మారుతున్నాయా.? అంటే అవునన్నట్లుగానే సమాధానాలు వినిపిస్తున్నాయి. పేదలకు అంత చేశాం, ఇంత చేశామని చెప్పుకునే ప్రభుత్వం.. పేదలకు గత ప్రభుత్వం కల్పించిన వసతిని కూడా దూరం చేస్తుందన్న సంకేతాలను మాత్రం వెలువరించింది.

గుజరాత్ రాష్ట్రంలో బుల్లెట్ రైలు కోసం నిర్మాణం.. వేగిరం అయ్యిందే తప్ప.. దేశంలోని రైల్వే మార్గాలు, వసుతులు, స్టేషన్లు మాత్రం ఇప్పటికే అలాగే వున్నాయని, మరీ ముఖ్యంగా దక్షిణ భారతంలో రైల్వేలో గణనీయమైన మార్పులు వస్తాయని అశించిన ప్రజలకు ఇంకా అడియాశే ఎదురవుతుందని విమర్శలు వస్తున్నాయి. సుదూర ప్రయాణాలను చేసే పేదలకు అత్యంత చౌకగా గమ్యస్థానాలకు చేర్చేటమే లక్ష్యంగా ప్రారంభమైన రైలు ప్రయాణాలపై ఎన్డీయే ప్రభుత్వం చార్జీల మీద చార్జీలు వేసి.. ఇక బుకింగ్ విధానంతో కూడా చార్జీల భారాన్ని లింక్ చేసింది అసలు ఉద్దేశ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కేవలం లాభాపేక్ష మార్గాన్నే ఎంచుకుంటుంది.

ఇక తాజాగా పేదలకు ఏసీ ప్రయాణం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణాలు కూడా భారం కానున్నాయి. గత కొన్నేళ్లుగా లినెన్‌ ధర పెరిగినప్పటికీ గరీబ్‌ రథ్‌ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్‌ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్‌ రథ్‌ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన బెడ్ రోల్ ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి.

10 సంవ‌త్స‌రాల నుంచి బెడ్ రోల్‌ ధరలను ఎందుకు మార్చ‌లేద‌ని ప్ర‌శ్నించి.. గ‌రీబ్ ర‌థ్ రైళ్లన్నింటిలో టిక్కెట్ చార్జీల్లో వీటిలో క‌ల‌పాల‌ని కాగ్‌ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. బెడ్‌రోల్‌ ధరలు టికెట్‌ ధరలో కలపితే రానున్న కొద్ది నెలల్లో గ‌రీబ్ ర‌థ్ రైలు ప్ర‌యాణ చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు. బెడ్ రోల్‌ కిట్స్‌ టికెట్ తో పాటే ప్రస్తుతం ఉచితంగా ఆఫర్‌ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్ లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్‌ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్‌ రథ్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  garib rath  price hike  bedroll kits  garib  ameer  UPA  NDA  

Other Articles