అర్టిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. అనతికాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగి.. సినీ ప్రోడ్యూసర్ స్థాయికి ఎదిగటంతో అనుమానాలు కలిగిన పోలీసులు.. ఆరా తీయగా, అతని వెనుకనున్న డొంక మొత్తం కదిలింది. ఎర్రచందనం కేసులో బుల్లితెర కమెడియన్, జబర్దస్త్ ద్వారా పేరుప్రఖ్యాతులను సాధించిన హరిబాబును ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..హరిబాబును తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.
ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్ లో చిన్న క్యారెక్టర్లు వేసే క్యారెక్టర్ ఆర్టిస్ హరిబాబు . తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉన్న హరిబాబు.. ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తాడు. హరిబాబు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని సమాచారం రావడంతో..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ కమెడియన్ సినిమాకు హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు టాలీవుడ్ టాక్.
తిరుపతిలో టాస్క్ఫోర్స్ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేశారు. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియా ముందు వివరిస్తామన్నారు తిరుపతి పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more