Jayalalithaa was never pregnant, TN govt ‘అమ్మ’పై హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం నివేదిక

Tn govt junks amrutha s claim of being jayalalithaa s biological child

jayalalithaa‬‬, Amrutha, Sailaja, madras high court, V. Prakash, tamil nadu government, jayalalthaa pregnancy, AIADMK,

State government has junked the claim of a Bengaluru-based woman claiming to be biological daughter of former Chief Minister late J. Jayalalithaa as a figment of imagination.

‘అమ్మ’పై హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం నివేదిక

Posted: 07/25/2018 12:28 PM IST
Tn govt junks amrutha s claim of being jayalalithaa s biological child

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలి విషయంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. జయలలిత తన తల్లి అంటూ అమె కూతురిగా చెప్పుకుంటున్న అమృత.. తనకు అమెకు చెందిన ఆస్తులు, అంతస్థులు వద్దని.. కానీ తన తల్లి జయలలిత అన్న గుర్తింపు మాత్రం కావాలని పేర్కోంటూ.. ఇందుకోసం అవసరమైతే తన డీఎన్ఏ టెస్టును కూడా చేయాలని అమె మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ పిటీషన్ విచారిస్తున్న రాష్ట్రోన్నత న్యాయస్థాంలో తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది.

జయలలిత తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తెలిపింది. ఈ మేరకు 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను కోర్టుకు సమర్పించింది. తాను జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత కేసు వేసి కలకలం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. జయలలిత ఆస్తులపై కన్నేసిన అమృత వాటిని సొంతం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. ఒకవేళ అమృత.. జయలలిత కుమార్తే అయితే, తన జీవితకాలంలో ఆమెతో కలిసి ఒక్క ఫొటో కూడా ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు.

జయలలితకు తాను 1980 ఆగస్టులో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొనడంతో, అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను కోర్టుకు సమర్పించారు. అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపారు. అవసరం అనుకుంటే జయలలిత బంధువుల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa‬‬  madras high court  V. Prakash  Amrutha  Sailaja  tamil nadu government  

Other Articles