స్వయం ప్రకటిత సర్వసంగ పరిత్యాగికి స్వర్ణం మాత్రం ఇష్టం. ఈ బాబాకు.. ఐహిక సుఖాలు, బంధాలపై ఎలాంటి మోజు, అపేక్ష లేదు.. కానీ ఒక్క బంగారంపై తప్ప. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యలనే అరిషడ్ వర్గాలను నియంత్రణలో వుంచుకునే బాబా.. ఒక్క స్వర్ణం విషయంలో మాత్రం తన రూటే సపరేటు అని చూపుతున్నారు. తనకు బంగారంపై మక్కువ ఎక్కువని చెబుతూనే.. అయితే ఈ స్వర్ణాభరణాలతోనే ఆయన ప్రతీ ఏడాది కన్వార్ యాత్రకు వెళ్లడం విశేషం. ఇక ఈ బాబా గారి బంగారానికి సేఫ్టీగా పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు.
గోల్డెన్ పూరీ బాబా అలియాస్ సుధీర్ మక్కర్ బాబా.. ఎన్నో సంవత్సరాలుగా హరిద్వార్ నుంచి కన్వార్ వరకూ జరిగే సాధువుల యాత్రలో పాల్గొంటాడు. ఈ ఏడాదితో 25 వ సారి కన్వర్ యాత్రలో పాల్గొంటున్న ఈ బాబాకు పోలీసులు భద్రత కల్పించారు. ఎందుకంటే ఈ బాబా గారు గతంలో కంటే ఈ సారి మరింత ఎక్కువ బంగారం ధరించడం విశేషం. ఏకంగా 20 కిలోల బంగారు ఆభరణాలు ధరించి ఆయన కన్వార్ యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన వంటిపైనున్న బంగారు, వజ్రాభారణాల విలువ సుమారుగా రూ.6 కోట్లు పైచిలుకే ఉంటుంది.
రెండేళ్ల కిందట 2016లో 12 కిలోలు, గతేడాది 14.5 కిలోల బంగారంతో యాత్రలో పాల్గొన్నారు. ఏటా శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేపట్టే యాత్రను కన్వర్ యాత్రగా పిలుస్తారు. గతేడాది గోల్డెన్ బాబా ధరించిన ఆభరణాల్లో 21 గొలుసులు, దేవుడి విగ్రహాలతో కూడిన 21 లాకెట్లు, చేతి కడియాలు, బంగారపు జాకెట్, తదితరాలు ఉన్నాయి. ఈ బంగారం ఆభరణాలన్నీ ధరించి ఎస్యూవీ పైన కూర్చుని వెళ్తారు.
గతంలో తన వద్ద కొన్ని గ్రాముల బంగారం మాత్రమే ఉండేది.. ఇప్పుడు కిలోల కొద్దీ బంగారం ధరిస్తున్నానంటే అదంతా శివుడి దయేనని పేర్కోవడం’ విశేషం. కేవలం బంగారం మాత్రమే కాదు రూ.27 లక్షలు ఖరీదైన రోలెక్స్ చేతిగడియారం ధరించి, తన బీఎండబ్ల్యూ, మూడు ఫార్చ్చూన్స్, రెండు ఆడి, రెండు ఇన్నోవాలతో ఊరేగింపుగా వెళ్తారు. అలాగే హమ్మర్, జాగ్వార్, లేండ్ రోవర్ లాంటి కార్లను కూడా యాత్ర కోసం అద్దెకు తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more