ద్రవిడ ఉద్యమనేత, కవి, కళాకారుడు, సాహితీవేత్త, సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్రవేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్యనేత, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అభిమానుల అశ్రు నయనాల, కార్యకర్తల కన్నీళ్ల పర్యంతం కాగా.. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో అధికార లాంఛనాలతో కళైంజర్ అంత్యక్రియలు ముగిశాయి. ఏడు పదులకు పైగా రాజకీయ రంగంలో కొనసాగుతూ జాతికి సేవలందించిన కురువృద్ధ మహానేతకు గౌరవ సూచకంగా దేశరక్షణలో భాగమైన త్రివిధ దళాల సైనికులు సగర్వంగా వందనం సమర్పించి, గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు.
బతికినంతకాలం ద్రవిడ వాదమే నినాదంగా మార్చుకున్న మహానేత, హేతువాద పునాదులపై ఎదిగి.. బ్రాహ్మన అధిపత్యాన్ని ప్రశ్నించి.. ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ నేత.. లక్షలాది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ అనంతలోకాలకు తరలివెవెళ్లిపోయారు. తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలి, సుదీర్ఘ రాజకీయ అనుభవ ప్రతిభా సంపన్నుడు, వ్యూహప్రతివ్యూహాలను రచించే చతురతలో అపర చాణక్యుడు.. కళైంజర్ కరుణానిధి.. ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.
కరుణానిధి అస్తమయంతో దేశ రాజకీయాల్లో ఒక తరం వెళ్లిపోయింది. డీఎంకే అధినేతగా అర్ధ శతాబ్దానికి పైగా విస్తరించిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనితర సాధ్యంగా 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కరుణానిధి.. తన జీవితంలో ఎన్నడూ, ఏ ఎన్నికలోనూ ఓటమి అనేదే చూడకపోవడం విశేషం. కళలకూ రాజకీయాలకూ మధ్య అరుదైన అద్భుత వారధిగా నిలిచిన కరుణానిధి అస్తమయంతో ఒక శకం ముగిసినట్లైంది.
కరుణానిధికి అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. మాజీ ప్రధాని దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, పలువురు ప్రముఖులు కరుణానిధి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు డీఎం శ్రేణులు, అభిమానులు మెరీనా బీచ్ కి భారీగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత మంది మెరీనా బీచ్ దగ్గరకు వచ్చి తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికారు. కరుణానిధి అంత్యక్రియల సమయంలో కుటుంభసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more