HMWSS board shocks bigwigs along with Ruling Mla టాలీవుడ్ ప్రముఖుల నీటి చౌర్యం.. జాబితాలో బాబు మోహన్..

Hmwssb shuts tap six years ago illegal link continues

Hyderabad Metro Water Supply Board, Dana Kishore, Ravi Chandra Reddy, TRS MLA Babu Mohan, Pavan Kumar Palli, Madala Ravi, Film Nagar, Banjara Hills police station, illegal Water connection, Water Bill dues, Goshamahal SHO P Tirupati, Tollywood, crime

In the HMWS&SB official records, TRS MLA Babu Mohan's son Pavan Kumar Palli is notified as owner of a property (H No. 8-2-293/82/F/C-24) in Film Nagar. His dues ran up to Rs 4 lakh and the water connection falls under the commercial category.

టాలీవుడ్ ప్రముఖుల నీటి చౌర్యం.. జాబితాలో బాబు మోహన్..

Posted: 08/17/2018 03:40 PM IST
Hmwssb shuts tap six years ago illegal link continues

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ పన్నులు, బకాయిలు చెల్లించనివారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మరీ ముఖ్యంగా మహానగర తాగునీటి బోర్డుకు బకాయిపడిన వారి నుంచి నీటి బిల్లులును వసూళ్లు చేసేందుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో నీటి బిల్లులను ఏళ్లుగా చెల్లించని కమర్షియల్, మల్టీస్టోర్డ్ భవనాలపై అకస్మికంగా దాడులు నిర్వహించింది. బోర్డు పంపిన తాకీధులను అందుకుని కూడా ఏళ్లుగా మిన్నకుండిపోయిన యజమానులపై చర్యలకు ఉపక్రమించింది.

నోటీసులకు స్పందించని కమర్షియల్, బహుళ అంతస్థుల భవనాలకు నీటి కనెక్షన్లు తొలగించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కు అధికారులు ఝలక్ ఇచ్చారు. నల్లా కనెక్ష‌న్‌కు సంబంధించి బకాయిలు చెల్లించనందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆయన ఇంటికి కనెక్షన్ కట్ చేశారు. తన కుమారుడు పవన్ కుమార్ పేరున వున్న ఇంటికి అక్రమ నల్లా కనెక్షన్ ను తొలగించారు. ఆయనతోపాటు దివంగత మాదాల రంగారావు తనయుడు మాదాల రవి ఇంటికి కూడా వున్న అక్రమ నల్లా కనెక్షన్ తొలగించారు.

ఈ అంశంపై జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాబు మోహన్ తన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్‌కు సంబంధించి రూ.4 లక్షల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని అనేకసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని అన్నారు. దీంతో కనెక్షన్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఆలాగే బాబు మోహన్ తో పాటు సినీ నటుడు మాదాల రవి ఇంటికి కూడా కనెక్షన్ తొలగించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకూ నల్లా బిల్లులు రూ.3 లక్షలు దాటినా చెల్లించకపోవడంతో ఆయన నీటి సరఫరా నిలిపేశారు.

అయితే వీరిద్దరి నల్లా కనెక్షన్ ను 2012లోనే కట్ చేసినా అక్రమంగా కనెక్షన్ పెట్టించుకుని నీటిని వినియోగించుకుంటున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 9.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, బకాయిలు చెల్లించకపోవడంతో 80 వేల కనెక్షన్లు తొలగించారు. దీంతో కొందరు బకాయిలు చెల్లించి కనెక్షన్ తీసుకోగా, మరికొందరు పైపులను పగులగొట్టి నీటి చౌర్యానికి పాల్పడతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లోనే 8500 నీటి బిల్లులు బాకాయిలు వున్నాయన్నాయారు. దీంతో పాటు మాదాపూర్, ఫిలింనగర్, బేగంపేట, శ్రీనగర్ కాలనీలోనే అక్రమ కనెక్షన్లకు తెరతీసున్నారు. వాటర్ బోర్డు విజిలెన్స్ తనిఖీలు చేపట్టంగా కనెక్షన్లు పొందినట్టు తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles