police caught cross massage center red handedly మసాజ్ సెంటర్ కు గిరాకీలా వెళ్లి గిరాటేసిన పోలీసులు

Police caught cross massage center red handedly

AS Rao Nagar, saloon shop, cross massage, Hyderabad police, police caught cross massage red handed, police pretended as customers, ASRao Nagar cross massage, durai raj ganesh, kushaiguda police station, crime

On the tip of the information, Hyderabad police entered a saloon shop and pretented as customers for cross massage and then caught them red handed in AS Rao Nagar.

మసాజ్ సెంటర్ కు గిరాకీలా వెళ్లి గిరాటేసిన పోలీసులు

Posted: 08/28/2018 11:33 AM IST
Police caught cross massage center red handedly

పైన పటారం, లోన లోటారం అన్న సామెతను బాగానే వంటబట్టించుకన్న కేటుగాళ్లు.. పైకి ఏదో ఒక అందమైన పేరతో వ్యాపారాన్ని ప్రారంభించి లోపల మాత్రం తప్పుడు పనులు చేస్తూ, చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే వీరి ఆటలను కట్టించేందుకు పోలీసులకు కూడా ఇన్ ఫార్మర్లు అదే స్థాయిలో వుంటారు. ఇలా తమకు అందిన సమాచారంతో ఒక సెలూన్ షాపులో జరుగుతున్న క్రాస్ మసాజ్ తంతును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు.

సెలూన్ ముసుగుతో లోపల జరుగుతున్నది క్రాస్ మసాజ్, వ్యభిచారాంపై పిర్యాదులు అందుకున్న పోలీసులు వారి గుట్టును రట్టు చేసేందుకు ప్లాన్ వేశారు. దీంతో వారే కస్టమర్లుగా మారి మరీ.. సెలూన్ షాపుకు వెళ్లారు. అక్కడ ఏ మాత్రం అనుమానాలు రాకుండా సాధారణ కస్టమర్లలా ప్రవర్తించారు. మసాజ్ సంబంధించిన లావాదేవీలన్నీ మాట్లడిన తరువాత వారి అటను రెడ్ హ్యాండెడ్ గా కట్టించి నిర్వాహకుడితో పాటు మరో యువతిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్, ఏఎస్ రావు నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి రిలయన్స్ ఫ్రెష్ పై అంతస్తులో ఫౌంటెయిన్ సెలూన్ అండ్ స్పా నిర్వహిస్తున్నారు. ఇది అనుమతి లేకుండా నడుస్తోంది.

బోయిన్ పల్లికి చెందిన దురాయ్ రాజ్ గణేష్ అనే యువకుడు, ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెచ్చి వారితో పురుషులకు మసాజ్ చేయిస్తున్నాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాడు. అందులో అందమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అతని నిర్వాకంపై విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీసీ పోలీసులు, కస్టమర్లలా వెళ్లారు. వారికి కూకట్ పల్లికి చెందిన ఓ యువతితో మసాజ్ చేయించే ప్రయత్నం చేశాడు గణేష్. దాంతో ఆ యువతిని, నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AS Rao Nagar  saloon shop  cross massage  durai raj ganesh  kushaiguda police station  crime  

Other Articles