భార్యను చేరదీయకుండా దూరంగా ఉంచడంతో ప్రశ్నించినందుకు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా మణుగూరు ఎస్సై సముద్రాల జితేందర్.. తన భార్య పర్వీన్, అత్త తహెరాలను చితకబాదిన ఉదంతమిది. బాధితురాలు పర్వీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ మొగిళ్లపాడు గ్రామానికి చెందిన ఎస్సై జితేందర్ 2015లో వెంకటాపురంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పాల్వంచకు చెందిన తనను ప్రేమించాడు. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన తాను కూడా సమ్మతి తెలపడంతో.. ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపింది.
పెళ్లయిన వారం రోజుల నుంచే తనను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. వేధింపుల గురించి ఎవరికీ చెప్పవద్దని కూడా భార్యను బెదిరించాడు. పెళ్లయిన కొన్ని రోజులకు మొదటి సారి గర్భం దాల్చిన పర్వీన్ కు అబార్షన్ చేయించాడు. చింతకాని నుంచి కొత్తగూడెంకు బదిలీ అయిన సమయంలో పుట్టింటికి వెళ్లమని పంపించాడు. ఆ తరువాత కొత్తగూడెంలోని ఓ అధికారి ఇంటికి భార్యను పిలిపించి రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.
రెండోసారి గర్భం దాల్చిన సమయంలో మళ్లీ అబార్షన్ చేయించుకోమని వేధించాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఏడాదిగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పర్వీన్ ఫోన్ చేసినా స్పందించేవాడు కాదు. పది నెలల కిందట కుమారుడు జన్మించినా ఇప్పటివరకు బాబును ఒక్కసారి కూడా చూడలేదు. భార్య నుంచి విడాకులు కావాలని పదే పదే అడిగేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంవల్లే తనను దూరంగా ఉంచుతున్నాడన్న విషయం తెలిసింది.
ఈ విషయంపై బంధువులు జితేందర్ ను నిలదీయగా వారిపై దాడికి దిగాడని పర్వీన్ వాపోయారు. మణుగూరులో ఎస్సై నివాసానికి పర్వీన్, అత్త తహెరా వెళ్లి జితేందర్ ను నిలదీయగా వారిని విచక్షణారహితంగా కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పర్వీన్, తహెరాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు మణుగూరు సీఐ కొండ్ర శ్రీనివాస్ కు పర్వీన్ ఫిర్యాదు చేశారు. సంఘటనపై మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోర¢గా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్ పై కేసు నమోదు చేశామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more