జమిలి ఎన్నికలకు తెరతీసిన కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ.. అది సాధ్యం కాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వివరణతో ఇక ముందస్తు ఎన్నికల వైపు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటుగా అన్యోన్యత కొనసాగిస్తున్న తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుంది. అటు కేంద్రంలోని బీజేపి, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ రెండు ముందస్తుకు వెళ్తున్నా.. రెండు పార్టీల మధ్య మైత్రి కూడా కొనసాగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికలలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాయని వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే ఈ వార్తలపై బీజేపి జాతాయ అధ్యక్షుడు అమిత్ షా క్లారిటీ ఇచ్చారు., ఓ వైపు తెలంగాణలోనూ తమ సత్తాను చాటుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపి వీలైతే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, మోదీ ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడం, ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలోకి ఆకర్షించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది.
శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ ముఖ్యనేతలో సమావేశమైన ఆయన టీఆర్ఎస్తో పొత్తుపై పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని హామీలు, వాటి అమల్లో వైఫల్యాలపై ఛార్జిషీటు జారీ చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. కేంద్రం ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది తప్ప టీఆర్ఎస్ ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెబుతున్నట్టు వంద సీట్లు రావడం అసాధ్యమని పేర్కొన్న అమిత్ షా... ప్రచారానికి తాను కూడా వస్తానని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more