Retired SI battered to death పట్టపగటు రిటైర్డు ఎసైని కొట్టి చంపిన రౌడీలు

Allahabad retired cop beaten to death cctv footage goes viral

rowdy sheeters beat si to death, allahabad-city-crime,news,state,Daylight Murder, Allahabad, Retired SI, Abdul Samad Khan, Nitin Tiwari, Mohammed Yusuf, Allahabad High Court, UP Crime, Allahabad, Uttar Pradesh, crime

A retired police sub-inspector was allegedly battered to death by his relatives in Teliyarganj area in the district following an argument over a long-pending property dispute.

పట్టపగలు రిటైర్డు ఎసైని కొట్టి చంపిన రౌడీలు

Posted: 09/04/2018 04:25 PM IST
Allahabad retired cop beaten to death cctv footage goes viral

యూపీలోని అలహాబాద్ లో ఈ ఘోరం జరిగింది. రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ అయిన అబ్దుల్ సమద్ ఖాన్ తన ఇంట్లోంచి బయటకు వెళ్లటాన్ని గమనించిన రౌడీ షీటర్ ఆయ మార్గాన్ని అడ్డుకుని దారుణంగా కొట్టి చంపేస్తుంటే.. ఈ తతంగానంతా చూస్తూ వుండిపోయిన కాలనీ వాసులు మాత్రం చోద్యం చూశారు. కనీసం మనిషన్న విషయాన్ని అందులోనూ వృద్దుడన్న కనికరాన్నికూడా లేకుండా కర్రతో చావబాదుతున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మనిషన్నవాడు మాయమవుతున్నాడన్న దానికి ఇదే నిదర్శనం కాదా.

తన బంధువులతో ఏళ్లుగా న్యాయస్థానంలో పెండింగ్ లో వున్న అస్తుల గోడవ విషయంలో ఇవాళ ఉదయం కూడా బంధువులతో గొడవ జరిగింది. అది కాగానే తన పని తనది అన్నట్లుగా ఉదయాన్నే కూరగాయలు కొనడానికి ఓ గల్లీమీదుగా మార్కెట్ కు వెళ్తున్న. డెబ్బై ఏళ్ల వయసున్న సమద్ ఖాన్ ను వెనకగా అటకాయించాడు తన బంధువులలో ఒకడు. పొడుగాటి కట్టె పట్టుకుని వచ్చి ఎడాపెడా బాదాడు. పాపం.. అతడు మొదట కాస్త ఎదురుతిరిగేందుకు ప్రయత్నించాడు. కానీ 77ఏళ్ల వయస్సులో దెబ్బమీద దెబ్బ పడేసరికి కుప్పకూలిపోయాడు. కిందపడ్డ ఖాన్ ను మరింతగా కొట్టి కుల్లబొడిచారు.

రిటైర్డ్ ఎస్సై ఖాన్ ను ఇష్టమొచ్చినట్టుగా కొడుతుంటే జనం తమకేమీ పట్టనట్టుగా ఉండిపోయారు. అదో సినిమా అన్నట్టుగా చూస్తుండిపోయారు. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. ఒకడేమో బండిని తిప్పుకునిపోయాడు. ఇంకొందరు చూస్తూనే ఆ గల్లీనుంచి వెళ్లిపోయారు. పక్కనే అరుగు ఎక్కి వంగివంగి చూసిన మరికొందరు… కనీసం ఏం జరిగింది.. ఎందుకు కొడుతున్నావ్ అని కూడా అడగలేకపోయారు. తర్వాత మరో ఇద్దరు వచ్చి కర్రలతో అతడిని రక్తాలొచ్చేలా కొట్టారు. ముగ్గురూ కసితీరా కొట్టి వెళ్లిపోయారు. పాపం అతడిని ఒక్కడన్నా పాపం అనేటోడే లేడు. రక్తగాయాలతో ఉన్న అతడిపై కనీసం కనికరం చూపలేదు. ఓ చిన్న పిల్లవాడు మాత్రం కాసేపు ఆగి చూసి వెళ్లిపోయాడు. ఆ జ్ఞానం మిగతావాళ్లకు కూడా లేకుండాపోయింది.

అన్ని గాయాలతో అక్కడే పడిపోయిన అతడిని పోలీసులు హాస్పిటల్ లో చేర్చారు. హాస్పిటల్ బెడ్డుపైనే అతడు చనిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ క్రైమ్ ను అలహాబాద్ హైకోర్టు సు-మోటు కాగ్నిజెన్స్ గా తీసుకుంది. బుధవారం(సెప్టెంబర్ 5)లోగా కేసుపై డీటెయిల్స్ ఇవ్వాలని.. నేరస్తులను అదుపులోకి తీసుకున్నది లేనిదీ చెప్పాలని యూపీ ప్రభుత్వానికి ఆర్డరేసింది. రిటైర్డ్ ఎస్సైని కొట్టి చంపిన కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు జునైద్ ను అరెస్ట్ చేశారు. అతడిపై అప్పటికే చాలా కేసులున్నట్టు గుర్తించారు. మహమ్మద్ యూసుఫ్ అనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రాపర్టీ ఇష్యూ గురించే రిటైర్డ్ ఎస్సై సమద్ ఖాన్ ను జునైద్ .. తన స్నేహితులతో కలిసి కొట్టినట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daylight Murder  Allahabad  Retired SI  Allahabad High Court  UP Crime  Allahabad  Uttar Pradesh  crime  

Other Articles