Will kidnap women, says BJP MLA ప్రేమను నిరాకరించే అమ్మాయిలను ఎత్తుకురండీ..

Mla ram kadam called ravan after abduct girl remark

ram kadam, ram kadam kidnapping remark, ram kadam bjp, bjp mla kidnapping women, jitendra awhad, maharashtra bjp, devendra fadnavis, kidnapping remark, bjp, jitendra awhad, devendra fadnavis, twitter, women organisations, Maharastra

Ram Kadam, a BJP MLA in Maharashtra from Mumbai’s Ghatkopar constituency, found himself at the centre of a controversy after a video of him allegedly promising to abduct women, for men who seek his help, went viral.

ITEMVIDEOS: ప్రేమను నిరాకరించే అమ్మాయిలను ఎత్తుకురండీ.. పెళ్లి చేస్తా..

Posted: 09/05/2018 12:39 PM IST
Mla ram kadam called ravan after abduct girl remark

పాలనలో పారదర్శకత, యువతను సన్మార్గంలో నడిపించడం, ప్రజా సమస్యలను పరిష్కారించడం.. ఇలా నాయకులు అన్నింటా ప్రజలకు ఆదర్శంగా వుండాలి. వక్రమార్గంలో పనియనిస్తున్న యువతను కూడా తమ పథకాలు, సలహాలు, సూచనలతో సన్మార్గంలో పయనింపజేయాలి. కానీ ఇక్కడ ఓ బీజేపి ఎమ్మెల్యే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు ఇలా అనేక రంగాలకు చెందిన వారు వేదికపై వుండగానే అదే వేదిక నుంచి ఈ ప్రజాప్రతినిధి అమ్మాయిలను కిడ్నాప్ చేసిన పర్వాలేదని యువతకు నూరిపోశాడు.

వివరాల్లోకి వెళ్తే..కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహీ హండీ’ వేడుకల్లో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కడామ్ ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను అకట్టుకునేందుకు ఎమ్మెల్యే తన స్థాయిని మర్చిపోయి.. ఓ సంఘవిద్రోహ శక్తిలా మాట్లాడారని ఇప్పటికే మహిళా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మీ కుటుంబంలోని యువతులను కూడా మీ వ్యాఖ్యల ప్రేరణతో యువత ఎత్తుకెళ్లే ప్రమాదముందని కూడా పలువురు ఆయనకు సూచిస్తున్నారు. అమ్మాయిలను, మహిళలను దేవతలుగా ఆరాధిస్తామని చెబుతూనే వారికి ఎలాంటి విలువ లేకుండా.. వారి ఇష్టాఇష్టాలతో పనిలేకుండా.. అపహరించుకుని రండి పెళ్లి చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళాలోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

‘దహీ హండీ’ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్బాయిలకు తాను అండగా ఉంటానని, నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలని సూచించారు. అమ్మాయిలు కనుక ప్రపోజల్‌ను తిరస్కరిస్తే కిడ్నాప్ చేయాలని, లేదంటే తనకు చెబితే కిడ్నాప్ చేసి అప్పగిస్తానని ఆఫర్ ఇచ్చారు. తన ప్రేమను అమ్మాయి అంగీకరించడం లేదని ఒక్క మాట చెబితే ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి జరిపిస్తానని, తన ఫోన్ నంబరు రాసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు వేదికపై ఉండగానే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles