unemployment in India: 10.58 Lakh apply for 700 posts నిరుద్యోగ భారతం: 700 పోస్టులకు 10.58 లక్షల మంది పోటీ..

Unemployment in india 10 58 lakh apply for 700 posts

unemployment, unemployment in India, unemployment in Telangana, intermiediate qualification, vro posts, gradutes, post graduates, Mphil, PhD scholars, VRO posts, Telangana, 10.58 lakh candidates, 700 posts, politics

This is an example for unemployment in India: basic intermiediate qualification required for vro posts but gradutes, post graduates including Mphil, PhD scholars too applied for the VRO posts in Telangana, Total of 10.58 candidates apply for 700 posts

నిరుద్యోగ భారతం: 700 పోస్టులకు 10.58 లక్షల మంది పోటీ..

Posted: 09/05/2018 03:34 PM IST
Unemployment in india 10 58 lakh apply for 700 posts

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు.. తమ స్వప్నం సాకరమైన నాలుగేళ్లు పూర్తైనా.. నిరుద్యోగ యువత కలలను మాత్రం సాకారం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తాము చేసిన ప్రమాణాలు, చెప్పిన మాటలు, యువత విశ్వసించి గత ఎన్నికలలో వారికి పట్టం కట్టినా.. ఆ మాటలను, హామీలను  నీటిమూటలుగానే పాలకులు మారుస్తున్నారు అనేందుకు ఈ ఒక్క అంశమే దర్పణం పడుతుంది. ఎంతలా అంటే ప్రభుత్వం ప్రకటించిన 700 ఖాళీలకు ఏకంగా 10.58 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు 1512 మంది పోటీ పడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకుగాను 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ.. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం విశేషం. తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు ఎప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు ప్రకటిస్తాయో తెలియకపోవడంతో.. వచ్చిన ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి తమ దరఖాస్తులను పంపుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో వీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ పూర్తి చేసిన 4.49 లక్షల మంది అభ్యర్థులు వున్నారు.  కాగా, ఇంటర్‌ విద్యార్హత ఉన్నవారు 4.17 లక్షల మంది ఉన్నారు.

అంతేకాదండీ.. వీఆర్డో పోస్టు వచ్చినా.. తమ జీవితాలకు వెలుగు వస్తుందని భావించిన పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు 1.51లక్షల మందితో పాటు పీహెచ్‌డీ చేసినవారు 372 మంది, ఎంఫిల్‌ చేసినవారు 539 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచి అత్యధికంగా 1,56,856 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,56,096 దరఖాస్తులతో మహబూబ్‌నగర్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ జిల్లా నుంచి తక్కువగా 47,059 దరఖాస్తులు వచ్చాయి. వేరే రాష్ట్రాలకు చెందినవారు 14,042 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబరు 16న వీఆర్వో రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unemployment  Telangana  vro posts  VRO posts  Telangana  10.58 lakh candidates  700 posts  politics  

Other Articles