జీవితకాల రికార్డుతో ముందుకుసాగుతూ.. వాహనదారులపై పెనుభారం మోపుతున్న చమురు ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన ‘భారత్ బంద్’ చెదరు మదురు సంఘటనలు మినహా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల పార్టీల నాయకులు, కార్యకర్తల నేతృత్వంలో బంద్ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో కొందరు అందోళనకారులు రైల్ రోకోను చేపట్టగా, కొన్ని చోట్ల రాస్తారోకోలు కూడా నిర్వహించారు. బిహార్ లో అందోళనకారులు ఓ పెట్రల్ బంక్ పై విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేశారు.
ఓ వైపు అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, మరోవైపు రూపాయి పతనం ఏకంగా పాతాళాన్ని చూస్తున్న క్రమంలో ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఇందుకు బీజేపి, ఎన్డీయేతర పార్టీలు మద్దతు పలకాలని కోరింది. దీంతో దేశంలోని రమారమి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్ కు మద్దతు పలికి.. బంద్ లో పాల్టోంటున్నాయి. ఈ క్రమంలో పలు చోట్లు చెదరుమదురు ఘటనలు జరిగినట్లు సమాచారం. బంద్ నేపథ్యంలో పాట్నాలో అందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం అలుముకున్నట్లు సమాచారం.
ఇక ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారత్ బంద్ చేపట్టేందుకు వచ్చిన రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయనకు తన ఘనంగా నివాళులు అర్పించి అంజలి ఘటించారు. ఆనంతరం అక్కడే స్థానికంగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్వకు చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగుతోంది. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ధరల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. బిహార్ రాజధాని పాట్నాలో ఎల్జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్ పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గుజరాత్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ధరల పెంపునకు నిరసనగా రోడ్లపైకి చేరిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సులను అడ్డుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంద్ నేపథ్యంలో ముంబయి లోకల్ రైళ్ల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. మరోవైపు బంద్ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఈ బంధ్ లో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్) సహా 21 విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more