telangana goverment morphs photo of couple జగ్గారెడ్డి అరెస్టు.. నిరసనగా సంగారెడ్డి బంద్

Telangana congress leader jagga reddy arrested for passport fraud

jagga reddy, jagga reddy arrested, jagga reddy fake passport, telangana jagga reddy, jagga reddy fake visa, jagga reddy usa 2004, human trafficking, forgery, telangana goverment morphs photo, telangana goverment paper advt, telangana congress, telangana news

Former MLA and senior Telangana Congress leader K Jagga Reddy has been arrested by the Hyderabad Police for allegedly carrying a fake passport and a visa.

అక్రమ రవాణ కేసులో జగ్గారెడ్డి అరెస్టు.. నిరసనగా సంగారెడ్డి బంద్

Posted: 09/11/2018 10:53 AM IST
Telangana congress leader jagga reddy arrested for passport fraud

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పటాన్ చెరులో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనుషుల అక్రమ రవాణా కేసులో ముగ్గురిని భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికా తీసుకెళ్లి, అక్కడే వదిలి వచ్చారన్న అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపుగా ఏడాది కాలం నుంచి మనుషుల అక్రమ రవాణా కేసును విచారిస్తున్న పోలీసులు ఆయనను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పటాన్ చెరువుకు చెందిన తన అభిమానుల ఇంటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఆయనపై నమోదైన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. జగ్గారెడ్డి 14 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లేందుకు తనతో సహా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో మొత్తం నలుగురికి పాస్‌పోర్టులు, వీసాలు తీసుకున్నారు. అయితే, తిరుగు ప్రయాణంలో అమెరికా నుంచి ఆయన ఒక్కరే వచ్చారంటూ ఓ వ్యక్తి సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు తన భార్య, పిల్లలను కాకుండా గుజరాత్ కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి వదిలి వచ్చినట్టు గుర్తించారు. దీంతో మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డి అమెరికాకు ఎవరిని తీసుకెళ్లారు? ఎందుకు అక్కడ వదిలి వచ్చారు? అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి నియోజకవర్గంలో బంద్ కొనసాగుతుంది. వేలాది మంది జగ్గారెడ్డి అనుచరులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను, వాణిజ్యసముదాయాలను బంద్ చేయిస్తున్నారు.

కాగా, గాంధీ అసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ సభ తర్వాత తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్, హరీశ్ రావు కుట్ర చేశారన్నారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావును గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేశారని జగ్గా రెడ్డి అన్నారు. తాను ఎవరినీ విదేశాలకు తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. కేసీఆర్, హరీశ్ రావుపై కూడా నకిలీ పాస్‌పోర్ట్ కేసులున్నాయని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  arrest  fake passport  human trafficking  forgery  photo morphing  telangana goverment  

Other Articles