పెట్రోల్, డీజిల్ ధరలు శతకాన్ని బాదేదుంకు పరుగులు పెడుతుండటంతో వాహనదారుల గుండెలు గుబేలు మంటన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ధరలు వాటితో అవే పోటీ పడుతూ పెరుతూపోతున్నా. అటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో పాటు ఇటు ఇంధన సంస్థలు మాత్రం ఏ మాత్రం స్పందించకుండా దున్నపోతు మీద కుంభవృష్టి పడినా చలించని విధంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు కూడా ప్రజల నుంచి వినబడుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చినా పట్టన అధికార పక్షం.. బంద్ రోజున కూడా ధరలను పెంచిదంటే.. ఇది ప్రజా ప్రభుత్వమే కాదని కూడా విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఇక తాజాగా ఇవాళ కూడా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నా.. ఇవాళ కూడా ఏకంగా లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్ పై 24 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగేప్పుడు ముప్పై పైసల నుంచి యాభై పైసల వరకు పెంచే చమురు సంస్థలు, కేంద్ర ఇంధన శాఖలు.. మరి ధరల తగ్గిన క్రమంలో మాత్రం అదే స్థాయిలో ధరలను తగ్గించేందుకు మాత్రం అంగీకరించవన్నది ఇటీవలే వాహనదారులు చవిచూసిన సత్యం. మే మాసంలో వరుసగా పెరిగిన ధరలు.. ఆ తరువాత తగ్గించాల్సి వచ్చినప్పుడు.. ఎదురైన అనుభవాలను వాహనదారులు అప్పుడే మర్చిపోలేకపోతున్నారు.
ముందుగా రూపాయి మేర తగ్గింపు అని ప్రకటించిన చమురు సంస్థలు... లేదు లేదంటూ కేవలం పైసాను మాత్రమే తగ్గించామని మాటమార్చిన నేపథ్యంలో దీనిపై నెట్ జనులు పెట్రో ధరలపై నెట్టింట్లో అడేసుకున్నారు. ఇక తాజాగా పెరిగిన ధరలతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ. 88.67కు, డీజిల్ ధర రూ. 77.82కు చేరుకున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తలెత్తింది. ఇక ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.28గా ఉండగా, డీజిల్ ధర రూ.73.30కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 84.49కి, డీజిల్ ధర రూ. 77.49కు పెరిగింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 86.18కి చేరగా, కోల్ కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.14కు పెరిగింది.
గత నాలుగేళ్లుగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గినప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలను వాహనదారులకు వర్తించకుండా అడ్డుకుని.. ఆ తగ్గిన ధరల మేరకు ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటిని పెంచి వాహనదారుల డబ్బును నాలుగేళ్లుగా ప్రయోజనం కల్పించకుండా చేసిందని.. ఇప్పుడు ధరలు పెరుగుతున్న క్రమంలో అప్పుట్లో విడతల వారీగా పెంచిన ఎక్సైజ్ పన్నును తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇంధన ధరలు పెరగడంతో దీని ప్రభావం రవాణ రంగంతో పాటు అన్ని రంగాలపై పడుతూ దేశంలో నిత్యావసర సరుకుల నుంచి అన్ని వస్తువులు, సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more