సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రభుత్వ అసుపత్రి ఎదుట జరగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసులో తన నేరాన్ని అంగీకరించాడు అమృత వర్షిణి తండ్రి మారుతీరావు. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం తనకు నచ్చలేదని, అందుకనే తాను అతడ్ని హత్య చేయించేందుకు పది లక్షల సుపారీ ఇచ్చానని కూడా అంగీకరించాడు. ప్రణయ్ హత్య కేసు అనంతరం పరారీలో వున్న మారుతిరావుతో పాటు అతడి సోదరుడు శ్రావణ్ లను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కూతురి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ...కిరాయి హంతకుడికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నట్లు తెలుస్తుంది. మిర్యాలగూడకు చెందిన పెనుమాళ్ల ప్రణయ్ ఎనమిది నెలల క్రితం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో అమృత వర్షిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అమృత గర్భవతి. ఆమెను ఆస్పత్రిలో చూపించి ఇంటికి వెళుతుండగా ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే.
అయితే ప్రణయ్ ను హతమార్చేందుకు అతడి ఇంటి వద్దే పలుమార్లు కిరాయి హంతకుడు... రెక్కీ నిర్వహించినా అది సాధ్యపడలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. దీంతో హత్య జరిగే రోజు ఉదయం కూతరు అమృతతో ఫోన్ ద్వారా మాట్లాడిన మారుతిరావు.. అమెతో ఎంతో చక్కగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. దీంతో మిర్యాలగూడ అసుపత్రికి వెళ్తున్న విషయాన్ని తన తండ్రికి చెప్పింది అమృత. అదే అమె పాలిట శాపంగా మారింది. దీంతో సుపారి వ్యక్తులకు సమాచారం అందించాడు మారుతిరావు. పథకం ప్రకారం అక్కడి చేరుకున్న అగంతకుడు.. వెనుకగా వెళ్ళి ప్రణయ్ ను అత్యంత దారుణంగా నరికి చంపాడు.
కళ్లెదుటే భర్త దారుణంగా హత్యకు గురి కావడంతో అమృతవర్షిణి షాక్‌కు గురి అయింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. కాగా విదేశాల్లో ఉన్న సోదరుడు వచ్చాక ప్రణయ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు మిర్యాలగూడ బంద్ చేపట్టాయి. మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more