తాగిన మత్తు తలకెక్కింది. ఇకనేం.. బాగుంది.. ఇంటికి వెళ్లి ఓ ముద్ద తిని పడుకుంటే బాగుండేది. అలా కాకుండా దారిలో తన మానన తాను వెళ్తున్న ఓ పామును అటపట్టించి.. బతికున్న పామును మింగేసిస రైతు.. ఇంటికెళ్లిన నాలుగు గంటల్లోనే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. మహిపాల్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది.
దానిని చేతిలోకి తీసుకుని ఓ చేత్తో దానిని పట్టుకుని మరో చేత్తో బిడిని పీలుస్తూ.. ఎందుకులే అనుకున్నాడో ఏమో కానీ దానిని తిరిగి కింద వదిలిపెట్టాడు. ఇంతలో ఈ తంతంగాన్ని వీడియో తీస్తున్న కుర్రాళ్లు.. కాకా దాని పట్టుకో, దాని మూతిని గట్టిగా పట్టుకో అంటూ అరచే సరికి మళ్లీ పాము పిల్లతో అటలాడాడు. అప్పటికే అది భయంతో ముడుచుకుపోయింది. దానితో కాసేపు ఆటలు ఆడిన మహిపాల్, ఆ తర్వాత దాన్ని మింగేశాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మహిపాల్.. నాలుగు గంటల తర్వాత చనిపోయాడు. మహిపాల్ చనిపోడానికి ముందు ఆ పాము పిల్లతో ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను పాముతో ఆడుతుండగా అక్కడ ఉన్న కొందరు ఆ పామును నోటిలో పెట్టుకో అన్నారు. దీంతో అతడు తలపై పెట్టుకుని నోరు తెరవడంతో అది నోటిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత మహిపాల్ ఆరోగ్యం క్షీణించింది. వాంతులు చేసుకున్నా పాము కడుపు నుంచి బయటకు రాలేదు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మహిపాల్‌కు 3 కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more