భేటీ పడావ్.. భేటీ బడావ్.. అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం ఎంత చక్కగా పనిచేస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. దేశవ్యాప్తంగా ఎలా వుందన్న విషయానికి పక్కనబెడితే.. స్వయంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న వారింట్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయో ప్రజలందరికీ అవగతం అవుతుంది. ఇంతకీ ఎవరా మంత్రి అంటారా.? లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బేటీ విషయంలో అనుసరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన కుటుంబంలోని అంతర్గత విభేదాలు బజారుకెక్కాయి.
ఆయనపై ఆయన కుమార్తె ఆశా, అల్లుడు అనీల్ సాధు సంచలన అరోపణలు చేశారు. తన పట్ల తన తండ్రి వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. కుమారుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే తన తండ్రి పట్టించుకుంటున్నారని... తమ విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారని ఆశా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తన అన్న చిరాగ్ ను ఓడించేందుకు తాను బరిలోకి దిగుతానని ఆశా తెలిపారు. తనకు టికెట్ ఇచ్చి, సహకరించాలని ఆర్జేడీ అధినేత లూలూప్రసాద్ యాదవ్ ను కోరారు.
కేవలం తన సోదరుడి రాజకీయ భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుని తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారే తప్ప.. తమ రాజకీయ ఎదుగుదల కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అరోపించారు. లోక్ జనశక్తి పార్టీకి అనుబంధంగా ఉన్న దళిత్ సేనకు బీహార్ అధ్యక్షుడిగా ఆశా భర్త అనిల్ కుమార్ సాధు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
కాగా, రాం విలాస్ సాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ తో పాటు తన సోదరుడు కూడా లోకసభ సభ్యులుగా కోనసాగుతున్నారు. ఇక మరో సోదరుడు నితీష్ క్యాబినెట్ లో మంత్రిగా కోనసాగుతున్నారు. ఆశా అరోపణలు తెరపైకి రావడంతో అసలెందీకీ వత్యాసం చూపుతున్నారన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు వినబడుతున్నాయి. రాం విలాస్ పాశ్యాన్ మొదటి భార్యకు చెందిన పిల్లలు కావడంతోనే వారిని పట్టించుకోవడం లేదని పుకార్లు కూడా వినబడుతున్నాయి. మొదటి భారకు గల ముగ్గురు ఆడపిల్లల సంతానంలో ఆశా చిన్నదిని కూడా సమాచారుం. అమెకు విడాకులు ఇచ్చిన తరువాత రెండో పెళ్లి చేసుకున్న పాశ్వాన్ కు రెండో భార్య కుమారుడు చిరాగ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more