Union Cabinet approves ordinance on triple talaq ఇకపై ట్రిఫుల్ తలాక్ నేరమే..

Union cabinet approves ordinance on triple talaq

Supreme Court, Triple Talaq Bill, triple talaq, Rajya Sabha, parliament, Ordinance, lok sabha, Ravi shankar Prasad, Asaduddin owaisi

The Union Cabinet on Wednesday approved an ordinance making triple talaq a punishable offence, said Ravi Shankar Prasad, minister for law and justice, IT.

ఇకపై ట్రిఫుల్ తలాక్ నేరమే..

Posted: 09/19/2018 08:24 PM IST
Union cabinet approves ordinance on triple talaq

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ విషయాన్ని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ముస్లిం మహిళల కోసం కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు గత పార్లమెంటు సమావేశాల్లో కార్యరూపం దాల్చలేదు. దీంతో కేంద్రం ఆర్డినెస్ రూట్ తొక్కింది.
 
తలాక్‌ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల బిల్లు-2017 గత డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో ఇటీవల ఆ బిల్లులో కేంద్రం మూడు కీలక సవరణలు చేసింది. అయినప్పటికీ వర్షాకాల సమావేశాల్లో బిల్లుపై చర్చ జరక్కపోవడంతో ముస్లిం మహిళలకు ఊరట కల్గించేందుకు కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

పార్లమెంటు సమావేశాలకు మరింత సమయం వున్న కారణంగా ఈ లోపు దానిని ఆర్డినెస్ రూపంతో తీసుకువచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో దీనిని బిల్లు రూపంలో చట్టంగా పునరుద్దరణ చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాగా, ప్రస్తుతానికి ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ దానిని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 2017 జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆర్డినెన్స్ రూట్‌‌ సరికాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బాధితురాలైన భార్య లేదా ఆమె సంబంధీకులు ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడే నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. మెజిస్ట్రేట్ నిర్దారించిన నిర్దిష్ట షరతులు, నింధనలకు బాధితురాలు ఒప్పుకుంటేనే రాజీ అనేది ఉంటుందన్నారు. బాధితురాలిని విచారించిన తర్వాత మాత్రమే సహేతుకమైన పద్దతిలో మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. మైనర్ పిల్లలు బాధితురాలైన భార్య దగ్గరే ఉంటారని, మెజిస్ట్రేట్ నిర్ధారించిన మెయింటెనెన్స్ ఆమెకు ఇవ్వాలి ఉంటుందని మంత్రి చెప్పారు.

ఇదిలావుండగా, ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ అని అన్నారు. ఆర్డినెన్స్ తో ముస్లిం మహిళలకు న్యాయం చేకూరదని వ్యాఖ్యానించారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని ఒవైసీ అన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. కేవలం నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం దీనిని తీసుకువచ్చిందని విమర్శించారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకు మాత్రమే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles