తమ డిమాండ్లు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలోకి ర్యాలీగా దూసుకోస్తున్న అన్నదాతల కిసాన్ క్రాంతి యాత్ర ఉద్రిక్తంగా మారింది. గాంధీజీ 150వ జయంతి దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా ర్యాలీని కొనసాగిస్తూ వస్తు్న రైతన్నలను ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమ శాంతియుత ర్యాలీని పోలీసులు ఎందుకు నిలువరిస్తున్నారని ప్రశ్నించిన రైతులు ఆందోళనకు దిగారు.
తమ రాకను అడ్డుకునేందుకు బ్యారికేడ్ల సరిపోవంటూ వాటిని తొలగించి మరీ ముందుకు సాగారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై భాష్పవాయువు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు. కాగా రైతు సంఘాల నేతల అందోళన నేపథ్యంలో క్రాంతి యాత్రను నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలను పిలిచిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వారితో చర్చలు నిర్వహించారు. దాదాపుగా రైతుల డిమాండ్ల అన్నింటినీపై సానుకూలంగా కేంద్రం స్పందించిందని విశ్వసనీయ సమాచారం. అయితే రైతుల రుణమాఫీపై మాత్రం అంగీకరించని కేంద్రం.. అక్కడే మెలిక పెట్టడంతో.. రైతన్నల అంధోళన ఇంకా కొనసాగుతుంది.
కాగా రైతుల రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గింపుతో పాటు పెరుగుతున్న ఇంధన ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుంచి సెప్టెంబరు 23న కిసాన్ క్రాంతి ర్యాలీ ఆరంభించి.. ఇవాళ దేశ రాజధాని డిల్లీ వద్దకు చేరుకున్నారు. అయితే ఉత్తర్ ప్రధేశ్ నుంచి ఢిల్లీకి చేరుకునే రహదారులన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ రైతులను బ్యారికేడ్ల సాయంతో నిలువరించారు. రైతులను నగరంలోకి పోలీసులు అనుమతించడం లేదు.
ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలోనే కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వాటర్ క్యానాన్లు ప్రయోగించి కిసాన్ ఘాట్‌కు వెళ్తున్న రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకెళ్లేందుకు వేలాదిమంది రైతులు యత్నించారు. దీంతో ఘజియాబాద్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు రైతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దుతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ స్పందిస్తూ.. ఇకపై తమ అభ్యర్థనలు తెలుపుకునేందుకు కూడా రైతులు ఢిల్లీకి రాకూడదా.? అంటూ ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వానికి తమ అభ్యర్థనలు చెప్పుకునే హక్కు కూడా రైతులకు లేదా.? అని ప్రశ్నించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతన్నలకు మద్దతు తెలిపారు. రైతులను నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more