ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల వెనక ఉన్న మరో విస్తుగొలిపే కోణం వెలుగులోకి వచ్చింది. కిడారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న వ్యక్తే అతడి కదలికలను ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి కిడారి, సోమ హత్యకు కారణమయ్యాడు. కిడారిని బావా.. బావా అని నమ్మించి మృత్యు ముఖంలోకి నెట్టివేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
డుంబ్రిగూడ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆయన భార్య స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. సోమకు దగ్గరి బంధువు అయిన ఆ రాజకీయ నాయకుడిని పావుగా వాడుకున్న మావోలు వారిని హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరినీ వేర్వేరుగా, కలిపి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లివిటిపుట్టులో పర్యటించిన మావోలకు వీరు ఆశ్రయం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో వారిని కలవడంతోపాటు ఆహారాన్ని కూడా వారికి అందించినట్టు సమాచారం.
సర్రాయిలో గ్రామ దర్శని కార్యక్రమానికి కిడారి బయలుదేరారన్న సమాచారం ఆ నాయకుడి ద్వారానే మావోలకు చేరిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. తనను చంపేస్తామని బెదిరించి లొంగదీసుకున్నట్టు ఆ నేత పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. కిడారితో మాట్లాడి, హెచ్చరించి వదిలేస్తారని భావించానని, చంపేస్తారని మాత్రం అనుకోలేదని పేర్కొన్నారు. కావాలనే మావోలకు సహకరించారన్న పోలీసుల ప్రశ్నకు అతడు మౌనం దాల్చినట్టు తెలుస్తోంది.
కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనక మూడు పార్టీలకు చెందిన గ్రామస్థాయి నేతలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, వారందరికీ గతంలో మావోలతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కిడారి హత్యలో మరో పదిమంది గ్రామ స్థాయి నాయకులు కూడా సహకరించారన్న సమాచారంతో పోలీసులు వారిపైనా నిఘా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more