DK Aruna files petition on assembly shedule తెలంగాణ ఎన్నికల షెడ్యూల్డు, అసెంబ్లీ రద్దుపై పిటీషన్లు

Dk aruna files petition on assembly dissolution in high court

dk aruna, congress, kcr, TRS, Election commission, high court, supreme court, marri shashidar reddy, voter list, assembly dissolution, bogus voters, votes missing, early elections, early polls, telangana election shedule, five state elections 2018

Telangana Congress leader DK Aruna filed two petitions in High Court, one on Telangana Assembly schedule release and another on assembly dissolution with out announcing the same in the House.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్డు, అసెంబ్లీ రద్దుపై పిటీషన్లు

Posted: 10/08/2018 03:36 PM IST
Dk aruna files petition on assembly dissolution in high court

తెలంగాణ ఓటర్ల జాబితా తప్పుల తడకగా వుందని, సుమారు 68 లక్షల బోగస్ ఓట్లు జాబితాలో పొందుపర్చుకున్న అధికార పక్షం.. వాటి అసరాతోనే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని అక్షేపిస్తూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మర్రి శశిధర్ రెడ్డి పిటీషన్ బుధవారానికి వాయిదా పడింది.

అయితే ఎన్నికల సంఘం కూడా కౌంటర్ అఫిడెవిట్ దాఖలు చేయడంతో.. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్డు విడదులతో పాటు శాసనసభ రద్దును సవాల్‌ చేస్తూ రెండు వేర్వేరు పిటీషన్లు హైకోర్టులో దాఖలైంది. శాసనసభ రద్దు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, ఎన్నికల షెడ్యూల్డు విడుదల చేయడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ రెండు పిటిషన్‌ వేశారు. అసెంబ్లీ రద్దుపై ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వలేదని అరుణ తన పిటీషన్ లో పేర్కోన్నారు.

ఐదేళ్లు ఉండాల్సిన సభను రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలోనే రద్దు చేశారని ఆమె ఆరోపించారు. మంత్రిమండలి తన పరిధి దాటి వ్యవహరించిందని.. గవర్నర్‌ కూడా ఆగమేఘాలపై రద్దును ఆమోదించారని డీకే అరుణ విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర వ్యాజ్యంగా విచారణ చేపట్టాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం దీనిపై విచారణ జరిగే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marri shashidar reddy  dk aruna  congress  kcr  TRS  Election commission  high court  

Other Articles