వివాదాస్పద రాఫెల్ డీల్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురయ్యేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. రాఫెల్ ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్లను కోట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి.. రాఫెల్ రాఫెల్ ఒప్పందం వివరాలను సీల్డ్ కవర్ లో ఈ నెల 29లోగా కోర్టుకు సమర్పించాలని అదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకుని కేంద్రాన్ని మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేయనున్నారు.
రాఫెల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకునపెడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఈ నెల 13న హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగులతో ఆయన సమావేశం కానున్నారు. రాఫెల్ ఒప్పందాన్ని హెచ్ఏఎల్ నుంచి లాక్కుని రిలయన్స్ డిఫెన్స్‌కు కట్టబెట్టారంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసింది. వేలాది కోట్ల విలువైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం రాహుల్ సమావేశంతో మరింత ఒత్తిడిలో పడేసే అవకాశాలున్నాయి.
ఫ్రాన్స్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్‌కు ఆఫ్‌సెట్ భాగస్వామిగా ప్రభుత్వ సారథ్యంలోని హెచ్ఏఎల్ సంస్థను కాదని వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన రిలయన్స్‌ను ఎందుకు ఎన్నుకున్నారో ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఈ డీల్‌ను రిలయన్స్‌కు అప్పగించడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు ఆవిరైపోయాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. ‘‘దేశంలోని యువకులు, వైమానిక దళం నుంచి సొమ్ము దొంగిలించి అంబానీ జేబులు నింపుతున్నారు. గత 70 ఏళ్లుగా హెచ్ఏఎల్‌కు విమానాల తయారీలో అనుభవం ఉంది. మిగ్, సుఖోయ్, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలను సైతం హెచ్ఏఎల్ తయారుచేసింది. కాబట్టి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అనిల్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ విమానం తయారుచేయలేదు. రాఫెల్ ఒప్పందానికి కేవలం 10 రోజుల ముందు ఆయన ఓ కంపెనీని సృష్టించి ఈ కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు..’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో రాఫెల్ ఒప్పందం హెచ్ఏఎల్‌కు వెళ్లిందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘హెచ్ఏఎల్‌కు కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా.. ఇక్కడ యుద్ధ విమానాలు తయారైతే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ బదిలీ అవుతుంది. వైమానిక దళం మరింత బలోపేతం అవుతుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ.526 కోట్ల విమానం ధర రూ.1600 కోట్లు అయ్యింది..’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more