తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనమిదవ రోజు కన్నుల పండువగా సాగుతున్నాయి. తిరుమల నవరాత్రి బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారి స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి.. స్వర్ణాభరణాలతో, ఫల పుష్పాలతో అలంకరించిన స్వర్ణ రథంపై ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై.. తిరు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
స్వర్ణ రథోత్సవంలో భజనలు, కళాకారుల సంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో మాడవీధుల్లో సందడి కనిపించింది. మరోవైపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామి శిరస్త్రాణాన్ని ధరించి, ఖఢ్గం చేతపట్టి యుద్ధ వీరునివలె అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తానని బోధిస్తూ స్వామివారు దర్శనమిస్తారు. భక్తులకు భౌతికమైన జ్ఞానేంద్రియాలను కట్టుదిట్టం చేసి దివ్యమైన జ్ఞానం సిద్ధింపజేస్తారు. అశ్వవాహన సేవతో శ్రీవారి వాహన సేవలు పూర్తికానున్నాయి.
అటు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఇవాళ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎనమిదవ రోజూన దుర్గాదేవి అమ్మావారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మరోవైపు దీక్ష విరమణ కోసం భవానీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు.
దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని జగన్మాత సంహరించారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. మహా ప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీ, దేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుంది.
ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. దేవి భాగవతం, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, రుగ్వేదాల్లో దుర్గాదేవి ఉపాసన గురించి పలు వివరాలున్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకుని, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలోని దేవిని ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో పూజించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more