డిజిటల్ మనీ, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను విరివిగా చెలామణిలోకి తీసుకురావడంతో దేశ ప్రజల్లో అధికంగా వినిపించిన ప్రశ్నలు అవి ఎంతవరకు భద్రంగా వుంటాయి. వాటి భద్రతా ప్రమాణాలు ఎంతవరకు సురక్షితం. సేఫ్. అయితే అదే సమయంలో దాదాపుగా ఆరు లక్షల మంది ఎస్బీఐ ఖాతాదారుల అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయన్న వార్త కూడా తెరపైకి రావడం.. ఇకపై అలాంటివి చోటుచేసుకోకుండా అన్ని బ్యాంకుల ఏటీయం కార్డులు చిఫ్ అమర్చనున్నామని బ్యాంకింగ్ రంగ నిపుణులతో పాటు అర్థికశాఖ ప్రముఖులు కూడా తెలిపారు.
ఇలా అధికారులు ఓ ఎత్తు వేస్తుండగా, అక్రమాలకు పాల్పడేవారు మరో రెండాకులు ఎక్కువగానే చదివామని నిరూపించుకునేలా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నెట్ బ్యాంకింగ్, మోబైల్ బ్యాంకింగ్ లతో ఇక ఎలాంటి అక్రమాలు లేకుండా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను అందుకోవచ్చు అని బ్యాంకులు తమ కస్టమర్లకు అందుబాటులోకి బ్యాంకింగ్ మోబైల్ యాప్ లను తీసుకువచ్చాయి. అయితే వీటిలో ఏది అసలుదో.. ఏది నకిలిదో తెలియక.. అనేక యాప్ బ్యాంకింగ్ యాప్ మోబైల్ ను పోలివుండటంతో.. అనేక మంది కస్టమర్లు తమ డాటాను, డబ్బులను పోగొట్టుకుంటున్నారు.
అదెలా అంటే.. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకులకు సంబంధించిన యాప్ లను గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా.. అయితే కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఈ బ్యాంకులకు చెందిన ఎన్నో నకిలీ యాప్‌లు కూడా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ నకిలీ యాప్‌ల ద్వారా వేలమంది బ్యాంక్ కస్టమర్ల వివరాలను చోరీకి గురవుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ సెక్యూరిటీ విభాగానికి చెందిన సోఫోస్ ల్యాబ్స్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది.
ఆయా బ్యాంకులకు సంబంధించి గూగుల్ ప్లేలో లభించే వాటిలో ఏది అసలుదో, ఏది నకిలీదో గుర్తించడం వినియోగదారులు కష్టసాధ్యంగా మారిందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఈ యాప్‌లలో ఉండే మోసపూరిత మాల్ వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలను దొంగిలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై సంబంధిత బ్యాంకులను సంప్రదించగా కొన్ని బ్యాంకులు ఎలాంటి నకిలీ యాప్‌లు చెలామణిలో లేవని తెలుపగా.. మరికొన్ని బ్యాంకులు దీనిపై విచారణకు ఆదేశించించినట్లు తెలిపాయని సోఫోస్ ల్యాబ్స్ తన నివేదికలో వెల్లడించింది.
ముఖ్యంగా ఏడు బ్యాంకులకు సంబంధించి నకిలీ యాప్స్ చెలామణిలో ఉన్నాయి. వీటిలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్ ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయమై బ్యాంక్ సైబర్ నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విషయమై ఇంతవరకు స్పందించలేదు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి కూడా సత్వర ప్రకటన వెల్లడి కాలేదు.
నివేదిక ప్రకారం.. రివార్డ్స్, కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, ఫ్రీ మొబల్ డేటా, ఉచిత రుణాల పేరుతో ఇంటర్నెట్ యాప్స్, ఈ వాలెట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగా.. అసలు యాప్ మాదిరిగా కనిపించే నకిలీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. దీనివల్ల డేటా బహిర్గతమవుతోంది. నకిలీ యాప్‌ల ద్వారా భారత ఉపఖండంలో వేలాది మంది బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యాయని సొఫోస్ ల్యాబ్స్ థ్రెట్ రిసెర్చర్ పంకజ్ కోహ్లీ అంటున్నారు.
ఆండ్రాయిడ్‌లో నకిలీ యాప్‌ల బెడద కొత్తేమి కాదని.. ఈ విధమైన మాల్వేర్లు ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ తో వాటి ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. మాల్వేర్ బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు కచ్చితంగా యంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను వినియోగించాలని, దీని ద్వారా డేటా సురక్షితంగా ఉంటుందని, నకిలీ యాప్‌లు డేటాను దొంగిలించకుండా ఇది రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more