hyderabadis follow SC orders in bursting crackers హైదరాబాదీలు.. ఈ సమయంలోనే బాణాసంచా పేల్చాలి

Hyderabadis follow supreme court guidelines in busting crackers says police

supreme court, guidelines, diwali, fire crackers, telangana, hyderabadis, police, DGP mahender reddy, Telangana police, crime

As per the Supreme court orders, telanganites and mainly hyderabadis must burst crackers in only two hours between 8pm to 10pm, says police.

దీపావళి బాణాసంచా కాల్చుతున్నారా.? అయితే ఈ విషయం తెలుసా..

Posted: 11/02/2018 06:37 PM IST
Hyderabadis follow supreme court guidelines in busting crackers says police

పర్యావరణం కలుషితంగా మారుతున్న క్రమంలో వేల కోద్ది రూపాయల బాణాసంచాను తీసుకువచ్చి.. కాల్చుతూ పర్యావరణాన్ని మరింతగా కలుషితం చేసే చర్యలకు దేశప్రజలు ఎవరూ పూనుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు బాణాసంచా పేల్చేందుకు పలు మార్గదర్శకాలను కూడా జారీ చేస్తూ వాటిని తప్పకుండా పాటించాలని కూడా తెలిపింది.

దీంతో దీపావళి రోజున మాత్రమే బాణాసంచాను కాల్చాలని.. అయితే అందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బాణాసంచా అమ్మకాలు, నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేసిందని... కోర్టు నిబంధనలకు అనుగుణంగా రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలోనే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేశారు.

అనుమతించిన సమయంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించిన స్థాయిలోనే శబ్ధం ఉండాలని స్పష్టం చేశారు.. ఈ ఆంక్షలు ఈ నెల 6వ తేదీ ఉదయం నుంచి ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. నగర ప్రజలు నిబంధనలకు అనుగూణంగా బాణాసంచా పేల్చాలని అంతేకానీ.. వాటిని అతిక్రమించవద్దని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  guidelines  diwali  fire crackers  telangana  hyderabadis  

Other Articles