రాష్ట్రం ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపును తట్టడంతో.. ఈ విషయంలో రాష్టోన్నత న్యాయస్థానం హైకోర్టులోనే ఈ అంశాన్ని తెల్చుకోవాలని, అందుకు పలు కండీషన్లను కూడా హైకోర్టుకు విధించిన సూచనలు జారీ చేయడంతో ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు మెట్టుదిగిరాక తప్పలేదు. రాష్ట్రంలో అనేక మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలోంచి తొలగించారని, అదే క్రమంలో ఒక్కో ఇంటి నెంబరుపై 150 నుంచి అపైన కూడా ఓట్లు నమోదయ్యాయని న్యాయస్థానం దృష్టికి శశిధర్ రెడ్డి తీసుకువచ్చారు.
అయితే అక్రమాలు ఏమీ లేవంటూ.. ఇంకా తుది జాబితా ప్రకటించలేదని, తుది జాబితాలో పలు సవరణలు చేస్తామని ఎన్నికల అధికారులు హైకోర్టుకు వివరించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎన్నికల అధికారులకు పలు అదేశాలను జారీ చేసింది. తుది జాబితా నేపథ్యంలో పలు మార్గదర్శకాలను పాటించాలని అదేశించింది. ఈ క్రమంలో అక్రమాలు జరగకుండా అందరి పేర్లు జాబితాలో వుండేందుకు సకల చర్యలు తీసుకున్న తెలంగాణ ఎన్నికల అధికారులు చెక్ యువర్ ఓట్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణలో బూత్ స్థాయిలో ఈ అదివారం ఈ కార్యక్రమం జరగనుంది. బూత్ స్తాయిలో సంబంధిత ఎన్నికల సంఘం అధికారులు బూత్ లలో వుండి ఓటర్ల జాబితాను పరిశీలించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ఓటర్ల జాబితాను ఓటర్లు పరిశీలించుకునే అవకాశం వుంది. ‘కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉంటారు. వారిని సంప్రదించి జాబితా చెక్ చేయండి. అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే అధికారులకు తెలియజేయండి’ అంటూ ఎన్నికల సంఘం సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more