Tremors reported near Polavaram project కుంగిన పోలవరం రోడ్డు.. ఒరిగిన స్థంభాలు..

Tremors near polavaram irrigation project site officials claim cracks due to vehicles

Polavaram project, earthquake, tremors, multi-purpose irrigation project, onsite workers, approach road, polavaram, west godavari

Tremors have been reported near multi-purpose Polavaram irrigation project site check post, the cracks have split open roads up to one km near the project area. People panicked as the approch road leading to the project site started cracking.

కుంగిన పోలవరం రోడ్డు.. ఒరిగిన స్థంభాలు.. అందోళనలో ప్రజలు

Posted: 11/03/2018 07:19 PM IST
Tremors near polavaram irrigation project site officials claim cracks due to vehicles

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ప్రాజెక్ట్ వద్ద ఒక్కసారిగా భూమీ చీలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పోలవరం ప్రాజెక్ట్ చెక్ పోస్టు సమీపంలో భారీగా పగుళ్లు ఏర్పాడ్డాయి. రోడ్లు చీలిపోగా, స్థంబాలు పక్కకు ఒరిగిపోయాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భూమి కంపించిదన్న అందోళనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అంతేకాకుండా మరికొన్ని చోట్ల రోడ్లు 4 అడుగుల మేర నేలలోకి కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో భూకంపం వచ్చిందని స్థానికులు భయపడుతున్నారు. వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రాకపోకలు స్తంభించాయి. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ చెక్ పోస్టు వద్ద 5 అడుగుల మేర భూమి పైకి చొచ్చుకొచ్చింది.
 
సమాచారం అందుకున్న ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ రోడ్డును పూర్తిగా మట్టితో నిర్మించామని పోలవరం ఇంజనీర్లు తెలిపారు. దీన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటామన్నారు. అయితే ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో పాటు రోడ్డు నిర్మాణంలో పెద్దపెద్ద రాళ్లు వాడిన నేపథ్యంలో  పట్టుతగ్గి రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఇక దీనికితోడు ఈ మట్టిరోడ్డుపై భారీ వాహనాలు వెళ్లడం కూడా బీటాలు వారడానికి కారణమని ఇంజనీర్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles