Janasena critisizes TDP Govt on Titli publicity తిత్లీ సాయం గొరంత.. ప్రచారం కొండంత: పవన్ విమర్శ

Pawan kalyan critisizes tdp govt on titli publicity

pawan kalyan, janasena, Titli Victims, Government responsibilty, natural disasters, titli help, TDP titli peanut help, everst publicity on titli help, Pawan Kalyan bus Yatra, pawan kalyan twitter, pawan kalyan press meet, pawan kalyan titli storm, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan critisizes ruling TDP party for publicity on large, with a peanut help to the Titli victims

తిత్లీ సాయం గొరంత.. ప్రచారం కొండంత: పవన్ విమర్శ

Posted: 11/12/2018 02:41 PM IST
Pawan kalyan critisizes tdp govt on titli publicity

ఆంధ్రప్రదేశ్ లో సేవాభావ పాలన, నిరాడంభ్రత పాలన, సుపరిపాలన, పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన, పర్యావరణహిత పాలనను తీసుకువస్తామని రాష్ట్ర ప్రజలను తమవైపుకు అకర్షించి.. అలోచింపజేస్తున్న సీనీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై మరోమారు తాజాగా విరుచుకుపడింది. ప్రకృతి వైపరిత్యాలు తలెత్తి సర్వస్వం కోల్పయిన ప్రజలను అదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా.? దానికి కూడా ప్రచారం అవసరమా.? అంటూ విమర్శించింది.


అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రచారంపై వున్న యావ, శ్రద్ద బాధిత కుటుంబాలను అదుకోవడంలో చూపించి వుండుంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ ఎదురుదాడి చేశారు. తిత్లీ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అన్ని విధాలా ఆదుకున్నామని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ మేరకు సహయక చర్యలు చేపట్టకపోగా.. చేసిన గోరంత సాయాన్ని ఎవరెస్టు పర్వతమంత ఎత్తున (కొండంత) ప్రచారం చేసుకుంటుందని విమర్శనాస్త్రాలు సంధించారు.

అధికార టీడీపీ పార్టీని విమర్శించేందుకు పవన్ కల్యాణ్ తనకు దక్కుతున్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని అక్కడి ప్రజలకు అసలు సాయమే అందలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శించారు. అండగా తానుంటానని హామీ ఇచ్చారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్‌కు తిత్లీ తుఫాన్ ఘటన ఒక ఆయుధంలా మారింది. అందుకే దీన్ని ఉపయోగించుకుని చంద్రబాబు ప్రభుత్వం దాడికి దిగుతున్నారు.

తాజాగా టీడీపీ ప్రభుత్వ ప్రచారాలను పవన్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘తిత్లీ తుఫాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత అండ!’ అని బస్సుపై ఏపీ ప్రభుత్వం అతికించిన ప్రచార చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పవన్.. ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సాయం వేరుశనగంత, కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ అంత. ఇది చూస్తుంటే అబ్రహం లింకన్ చెప్పిన సూక్తి ఒకటి గుర్తుకొస్తోంది’ అని పేర్కొన్నారు. పబ్లిసిటీ ఎంత గుర్తింపు తీసుకొస్తుందో అబ్రహం లింకన్ చెప్పిన సూక్తిని తన పోస్ట్‌లో పవన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  titli help  Mt. everst  natural disaster  peanuts  andhra pradesh  politics  

Other Articles