US man wins three lotteries in one day అదృష్టమంటే ఇదేరా.. అంటున్న అమెరికన్

Us man wins three times in one day playing scratch cards

US manRobert Stewart, American Robert Stewart, New Jersey Man Robert Stewart, Retired Union Leader Robert Stewart, Robert Stewart, American, Retired Union Leader, New Jersey, Scratch cards, 6 million dollsrs, viral news

A US man struck it more than lucky by bagging a $5m prize on a scratch card - then buying more tickets on the same day and twice winning again, lottery officials say.

అదృష్టమంటే ఇదేరా.. అంటున్న అమెరికన్

Posted: 11/12/2018 03:58 PM IST
Us man wins three times in one day playing scratch cards

కొన్ని తెలుగు సినిమాల్లో అనుకోకుండా ఎవరైనా గొప్ప ఇంటి అల్లుడైనా.. లేక గొప్పింటి అమ్మాయి పేద అబ్బాయిని ప్రేమించినా.. వెంటనే అతని స్నేహితులు చెప్పే డైలాగ్.. వాడికి అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది. అంటే బాధలో వున్నప్పుడు సినిమా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మనిషి తట్టుకోలేదు. ఈ క్రమంలో దానినే రివర్స్ చేసి ఇలా చెప్పడం సర్వసాధారణమే. ఇప్పుడీ విషయం ఎందుకు అంటారా.? ఇక్కడ మనం చెప్పబోతున్న వ్యక్తికి కూడా అలాంటి అదృష్టమే వరిందింది.

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలి అందులోనూ ఫస్ట్ ప్రైజ్ తగిలితే.. ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ఇక చాలురా బాబు అంటారు. తమ మిగతా జీవితాన్ని విలాసంగా .. దానధర్మాలు చేస్తూ గడిపేద్దామని అనుకుంటారు. ఇది చూసిన అతని స్నేహితులు మా వాడికి లాటరీ తగిలిందనే సంబరపడిపోతారు. ఇక అతని ఇంట్లో వాళ్లు సంతోషానికి హద్దే వుండదు. చాలు ఇక చాలు జీవితంలో సుఖపడే రోజులు వచ్చాయని ఆనందపడతారు. లక్ష్మీదేవి కటాక్షించిందని పొంగిపోతారు. కానీ ఇతగాడి అదృష్టం ఎలాంటిదంటే.. ఒక సారి లాటరీ కొట్టిన తరువాత కూడా మళ్లీ రెండు లాటరీలు తగిలాయి. అంటే ఒకే రోజు మూడు లాటరీలు తగిలాయి.

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన రాబర్ట్ స్టీవర్ట్ కొంతకాలం క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పోందారు. అయన ఉద్యోగంలో వున్నంత వరకు కార్మిక నేతగా కూడా విధులు నిర్వహించారు. అయితే ఉద్యోగ విరమణ చేయడంతో కార్మిక నాయకుడిగా కూడా అతడు రాజీనామా చేసి.. తన ఇంట్లో సేద తీరుతున్నా.. పాలుపోకపోవడంతో లాటరీల వైపు అకర్షితుడయ్యాడు. అంతే ఆయన కష్టాలకు వరుస అదృష్టం వరించి.. తాను పడిన కష్టాలను దూరం చేసి కోటీశ్వరుడిగా మలిచింది.

ఆయన జీవితంలో అత్యంత శుభదినం, ఏకంగా మూడు లాటరీల్లో విజేతగా నిలుపగా, మొత్తం 50 లక్షలా 600 డాలర్లు (సుమారు రూ. 36.24 కోట్లు) లభించాయి.  కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో మంచి క్రేజ్ సంపాదిస్తున్న స్క్రాచ్ కార్డులో రాబర్టుకు ఈ లాటరీలు తగిలాయి. ఈ విషయాన్ని ఆయన మీడియాకు చెబుతూ, స్క్రాచ్ లాటరీ గేమ్ లో 50 లక్షల డాలర్లు, రెండోసారి 500 డాలర్లు, మూడోసారి 7,276 డాలర్లను తాను గెలుచుకున్నానని చెప్పాడు.
ఈ ఏడాది ఆగస్టు 2న ఈ ఘటన జరిగిందని లాటరీ నిర్వాహకులతో తన పేరును బయట పెట్టవద్దని కోరానని చెప్పిన ఆయన, ఇప్పటికి కానీ తన పేరును బయట పెట్టాడానికి అనుమతించలేదు. ప్రస్తుతం ఆ డబ్బును తన కుటుంబానికి, వ్యాపారాభివృద్ధికి వాడుకుంటున్నానని చెప్పాడు. కాగా, ఈ సంవత్సరమే తనకు అదృష్టంగా మారిందని రాబర్టు చెబుతున్నాడు. ఎందుకంటే ఈ ఏఢాది ఆరంభంలో తనకు మరో ఒక లాటరీలో 2,500 డాలర్లు లభించాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles