ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అధికారంలో వున్న పార్టీల అభ్యర్థులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఓటర్లలో కూడా రాజకీయ చైతన్యం వచ్చినట్లు అర్థమవుతుంది. కేవలం ఎన్నికల ప్రచార సమయంలోనే పార్టీల అభ్యర్థులు తమ ఇళ్ల ముంగిళ్లలోకి వస్తారని, అప్పుడే వారిని నిలదీసి.. అన్ని అడిగేయాలని కూడా నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా గతంలో గెలుపొందిన అభ్యర్థులు ఇచ్చి నెరవేర్చని హామీలు ఏమయ్యాని నిలదీస్తున్నారు. ఇంతకన్నా మంచి సమయం తమకు మరెప్పుడు రాదని అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు, గ్రామాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న అధికార పార్టీల అభ్యర్థులపై ఓటర్లు మండిపడుతున్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అయితే ఇలాంటి పరాభవాలు నేతలు మామూలే అన్నవారూ లేకపోలేరు.
అయితే రాష్ట్రస్థాయి నేతలో.. లేక ముఖ్యమంత్రి హోదాలో వున్న నేతలు తమ తమ స్థానల్లో గెలుపొందేందుకు ప్రచారం ఏదో ఒకటో రెండు రోజులు మాత్రమే కేటాయిస్తారు. మిగతా అంతా వారి కుటుంబసభ్యులే చూసుకుంటారు. ఇదే తరహాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి తన భర్త నియోజకవర్గంలోని పనులను చక్కబెడుతుంటారు. అయితే గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అమెను కూడా అక్కడి ఓటర్లు ప్రశ్నించారు. దీంతో తెల్లముఖం వేసిన ఆమె అక్కడ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి సాధనా సింగ్ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, ఓ మహిళ నిలదీయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్ సింగ్ మరోమారు బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా, భర్త విజయం కోసం సాధన ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక మహిళా ఓటరు ఆమెను వాయించేసింది. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసింది.
ఓట్ల సమయంలో వచ్చి, అన్ని సమస్యలూ నెరవేరుస్తారని హామీలు ఇస్తారని, తమకు చుక్క తాగునీరు అందడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామంతా దాహంతో చచ్చిపోతున్నామని మండిపడింది. అక్కడే ఉన్న ఇతరులంతా ఆ మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆమె మాత్రం తగ్గలేదు. ఆ మహిళ వాదనకు సాధన సింగ్ షాక్ తగిలింది. నీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో బీజేపి కార్యకర్తలు శాంతి శాంతి అనగా.. ఏం శాంతి.. ఐదేళ్లుగా అదే చేస్తున్నామని బదులివ్వడంతో.. వారు కూడా కిమ్మనకుండా జారుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more