ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు తాజాగా సొంత పార్టీ నాయకుడిపైనా తన ధోరణి అదేనంటూ నిరూపించుకున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతం అయితే సబబుగా వుండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనుచరులు పెదవేగి మాజీ సర్పంచ్, టీడీపీ నేత సాంబశివ కృష్ణారావుపై దాడి చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పబట్టారు.
చింతమనేని ప్రభాకర్ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఎమ్మార్వో వనజాక్షి కేసు మొదలు అనేక పర్యాయాలు నచ్చజెప్పినా ఆయన తీరుమారండం లేదని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా చింతమనేని వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరి తీరు వల్ల మొత్తం పార్టీకి చెడ్డపేరు అపాదించేలా ఆయన వ్యవహారం వుందని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని అది తప్పితే ఎంతటి నేతకైనా భవిష్యత్ ఉండదని ఆయన హెచ్చరించారు.
అసలు కారణమేంటంటే..
ఎమ్మెల్యేగా తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో చింతమనేనికి ఈసారి విభిన్న పరిస్థితి ఎదురైంది. గ్రామస్థులు ఎదురుతిరగడంతో ఆయన తొలిసారిగా క్షమాపణ చెప్సాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెదపాడు మండలం దాసరిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి చింతమనేని హాజరయ్యారు. సభకు దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్ పామర్తి పెదరంగారావు కూడా హాజరయ్యారు. ఓ వ్యక్తికి ఉపాధి రుణం మంజూరు అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాడికి రుణం మంజూరు చేయాలని నీకెవడు సిఫార్సు చేయమన్నాడు?, గ్రామంలో నాకు తెలియకుండా పింఛన్లు ఎందుకు మంజూరు చేయిస్తున్నావ్?’ అంటూ అసభ్య పదజాలం అందుకున్నారు. రంగారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రంగారావు వెంటనే అక్కడి నుంచి తన స్వగ్రామమైన వేంపాడు వెళ్లిపోయారు. విషయం గ్రామస్థులకు చెప్పడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు.
గ్రామంలో ఏర్పాటుచేసి ఉన్న పార్టీ ఫ్లెక్లీలను తగుబెట్టారు. కాసేపటికి గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేని వాహనాన్ని అడ్డుకున్నారు. క్షమాపణ చెబితేగాని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో చింతమనేని ఓ మెట్టు దిగి ‘రంగారావు నాకు తమ్ముడి లాంటివాడు, ఏదో ఆగ్రహంలో అలా చేశాను’ అని సంజాయిషీ ఇచ్చినా గ్రామస్థులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే, రంగారావుకు మూడు సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన పోటీసుల సాయంతో ఊరి నుంచి బయటపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more