మద్యం మత్తు ఎంత పెద్ద ప్రమాదమో ఈ ఘటనతో రుజువైంది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ మహిళ... మత్తులో నిద్రపోయింది. అయితే ఆమె మత్తులో వెలగించుకున్న ఈ- సిగరేట్టే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. 42ఏళ్ల వివాహితైన కల్పన భర్త పిల్లల్ని వదిలి ప్రొఫెసర్‌తో సహజీవనం చేస్తుంది. ఇండోర్‌లోని పరమ్ విహార్ ప్రాంతంలోని ప్రొఫెసర్ కృష్ణపాల్తో కలిసి నివాసముంటుంది.
కల్పనకు మద్యం తాగే అలవాటు ఉండటంతో సోమవారం రాత్రి ఆమె ఫుల్‌గా మందుకొట్టింది. ఆ సమయంలో ఫ్రొఫెసర్ ఇంట్లో లేకపోవడంతో మద్యం... మత్తులోనే నిద్రలోకి జారుకుంది. అయితే.. ఆమె అప్పటికే ఈ-సిగరేట్ కూడా వెలిగించింది. మత్తులో ఉండటంతో ఆ విషయం మరిచింది. ఈ-సిగరేట్ ముందుగా దుప్పటికి అంటుకుంది. మంటలు వ్యాపించాయి. అమాంతం అవి మంచానికి అంటుకున్నాయి. మద్యం మత్తులో ఉన్న కల్పనకు మంటలంటుకున్న విషయం తెలియలేదు.
దీంతో ఆమె ఆ మంటల్లోనే సజీవదహనం అయ్యింది. ఇంట్లో మంటలు వ్యాపించిన విషయాన్ని ఇరుగుపొరుగువారి గుర్తించి ముందుగా కల్పన ఇంటి తలుపులుతట్టారు. అవి లోపల నుంచిలాక్ చేసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులకొట్టి చూసేసరికి అప్పుటికే మంటల్లో కల్పన కాలి బూడిదయ్యింది. అక్కడ పడి ఉన్న సిగరేట్ పెట్టెను గుర్తించిన పోలీసులు... ఈ-సిగరేట్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావించారు. ఫిర్యాదు అందుకోవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more