మీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నాయో లేదో ఓ సారి చూసుకోండి. ఇప్పటికే నోట్ల కష్టాలను, చవిచూసిన దేశ ప్రజలు ఇక వచ్చే ఏడాది నాటికి ఏటీయం కష్టాలు కూడా పడాల్సిరానుందన్న వార్త ఇప్పటికే బ్యాంకు కస్టమర్లను అందోళనకు గురిచేస్తుండగా, తాజాగా బ్యాంకులు జారీ చేసిన కార్డులు పనిచేస్తున్నాయా.? లేదా అన్నది చూసుకోవడమేంటన్న ప్రశ్న మీలో ఉదయిస్తుంది కదూ. కానీ ఇది నిజం. అయితే బ్యాంకులు జారీ చేసిన పాత డెబిట్, క్రెడిట్ కార్డులు ఇక చెల్లిపోయే కాలం వచ్చేసింది.
డిసెంబర్ 31 తర్వాత పాత డెబిట్, క్రెడిట్ కార్డులు చెల్లవని ఆర్బీఐ ఆదేశాలకు జారీ చేసింది. బ్యాంకులు జారీ చేసిన పాత కార్డుల తాలుకూ వాలిడిటీ ఎంతో కాలం వున్నా ఆవి మాత్రం ఇక చెల్లబోవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఖాతాదారులు వెంటనే తమ వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు కోరుతున్నాయి. లేదంటే డిసెంబరు 31 తర్వాత.. అంటే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆ పాత కార్డులు పనిచేయవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జారీచేసిన ఆదేశాల ప్రకారం.. ఖాతాదారులు పాత 'మాగ్నెటిక్ స్ట్రిప్' ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలి. ఈ కొత్త ఈఎంవీ కార్డులు మరింత భద్రతతో మోసాలు జరగకుండా అడ్డుకుంటాయి. 2015, ఆగస్ట్ 27న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు పాత కార్డులను రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశించింది. దీనికోసం మూడేళ్ల సమయం ఇచ్చింది.
సెప్టెంబర్ 1, 2015 నుంచే కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించిన ఆర్బీఐ.. బ్యాంకులు జారీ చేసిన పాత కార్డులను క్రమంగా అధునీకరించిన కొత్త ఈఎంవీ కార్డులతో బదిలీ చేసింది. అయితే ఇంకా చాలా మంది కస్టమర్లు తమ పాత కార్డులను కొత్తవాటితో రీస్లేస్ చేసుకోలేదు. దీంతో మరో నెల రోజుల్లో వాటిని మార్చాలని బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. కాగా, పాత కార్డులను రెండు రకాలుగా మార్చుకునే వీలుంటుంది. ఒక మీ సంబంధిత బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ-సర్వీసెస్‌లో ఏటీఎం కార్డ్ సర్వీసెస్‌లోని రిక్వెస్ట్ ఏటీఎం/డెబిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాలిడిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more