టీడీపీ పార్టీ రధసారధి దివంగత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసినికి మద్దతుగా ఆమె సోదరుడైన యంగ్ టైగర్ జానియర్ ఎన్టీఆర్ అమె తరపున ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారా.? లేదా.? అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ టీడీనీ శ్రేణులను కలవరపెడుతుంది. సోదరి కోసం సోదరుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారా.? లేదా.? అన్న ఉత్కంఠ వారిలో నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ రాకతో తన సోదరి తరపున ప్రచారం నిర్వహించడంతో అమె గెలుపు రమారమి నల్లేరుపై నడకగా మారుతుందని వారు భావిస్తున్నారు.
తెలంగాణలో ఒకే దశలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశముంది. ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రచారానికి తెరపడనుంది. అయితే నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారంలో అమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కలసివస్తారా.? కనీసం చివరి రోజైనా అమె తరపున ప్రచారం నిర్వహిస్తారా.? లేదా.? అమె రాజకీయ అరంగ్రేటాన్ని విజయవంతం చేస్తారా.? లేదా.? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇప్పటికే సుహాసిసి తరుపున మరో నందమూరి హీరో తారక్ రత్న ప్రచారం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ బిడ్డను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునితా కూడా ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా రోడ్ షోలతో పార్టీ శ్రేణులలో నూతనోత్తేజం తీసుకువచ్చారు. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా రోడ్ షోలతో సుహాసినికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో సుహాసిని అభ్యర్థిత్వంపై స్థానికంగా వక్తమైన వ్యతిరేకత తగ్గించడంతో పాటు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నధం చేయడంలో వీరు సఫలీకృలయ్యారు.
అయితే ఇప్పటికీ కూకట్ పల్లి నియోజకవర్గంలో సుహాసిని గెలుపు మాత్రం అంత ఈజీ కాదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మాదవరం కృష్ణారావు, అటు కుల ప్రాతిపదికన, ఇటు ప్రాంతాల ప్రాతిపదికన ఓటర్లను విభజించి వారితో సమావేశాలను ఏర్పాటు చేసి.. వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. ప్రజాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో.. కాంగ్రెస్ నేతలు కూడా అలకబూనారు.
టీడీపీ అభ్యర్థికి సానుకూలంగా ప్రచారం చేయకుండా కొందరు అంటిముట్టనట్టు దూరంగా వుంటున్నారు. అయితే కొందరు మాత్రం సుహాసినికి మద్దతుగా నిలుస్తుండగా, మరికోందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులతో టీఆర్ఎస్ అభ్యర్థితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగునాట ప్రేక్షకులలో అకాశమంత అదరణ, అభిమానులు వున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆమె రాజకీయ అరంగ్రేటాన్ని సఫలీకృతం చేస్తారని రాజకీయ వివ్లేషకులు అంచన.
అయితే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్ రామ్ తో కలసి తన సోదరి సుహాసిని తరపున ఎన్నికల ప్రచారం చివరి రోజైన 5న రోడ్ షోలు నిర్వహిస్తారని పార్టీ వర్గాల అనధికార సమాచారం. అయితే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల రోడ్ షోలు అమెను గట్టెకిస్తాయని కూడా పార్టీ వర్గాల భావన. కానీ ఇంతకీ ఎన్టీఆర్ తన సోదరి తరపున రోడ్ షోలు నిర్వహిస్తారా.? లేదా..? అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ విషయాన్ని అటు పార్టీ వర్గాలు కూడా అధికారికంగా తెలుపకపోవడంతో ఇటు కార్యకర్తలు, అటు అభిమానులలో ఉత్కంఠ రేకెత్తుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more