బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణంగా తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా.. ఉన్న ఫలంగా మంచివాడిగా మారాడు. ఇన్నాళ్లు తాను బ్యాంకుల నుంచి పోందిన రుణంలో ఇంత చెల్లిస్తాను, అంత చెల్లిస్తాను, ఇన్ని వాయిదాల కింద చెల్లిస్తాను.. అంటూ షరతులు పెడుతూ వచ్చిన విజయ్ మాల్యా ఇప్పుడు మాత్రం తాను తీసుకున్న రుణాలు నయా పైసాతో సహా తిరిగి చెల్లిస్తానని అంటున్నారు. దయచేసి బకాయిలు తీసుకోండి అంటూ బ్యాంకులు, భారత ప్రభుత్వానికి కోరుతున్నాడు.
అయితే తాను ఎగవేతదారు కాదని, 100శాతం రుణాలు చెల్లిస్తానని మాల్యా చెబుతున్నారు. ‘బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయానని, నేను ఓ ఎగవేతదారునని మీడియా, రాజకీయ నాయకులు పదేపదే చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు’ అని మాల్యా ట్వీట్ చేశారు. ఈయన గారి వ్యవహారం చూస్తుంటే రాజకీయ నాయకులు, మీడియా తాను ఎగవేసిన సోమ్ము కట్టారా.? ఎందుకు నిందిస్తున్నారు.? అని కూడా అనేట్టున్నారు.
ఇక మరిన్ని ట్వీట్లలో.. ‘విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. చాలా నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్నాం. కానీ నేను తీసుకున్న మొత్తాన్ని 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా. దయచేసి తీసుకోండి. మూడు దశాబ్దాల పాటు భారత్లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొంది.
‘దేశ ఖజానాకు రూ. వేల కోట్లు ఇచ్చాం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్ లైన్ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అయినా కూడా ఇప్పటికే నేను డబ్బు చెల్లిస్తాననే చెబుతున్నా. ఎందుకంటే అది ప్రజల డబ్బు. దయచేసి ఆ బకాయిలు తీసుకోవాలని బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని మాల్యా చెప్పుకొచ్చారు. ఈ రుణాలతో చేసిన వ్యాపారాలతో లాభాలు అర్జించివుంటే.. లాభాలను ఇచ్చేవారా.? లేక గతంలో అర్జించిన లాభాలను ఇస్తారా.? మాల్యా రూటే సపరేటు అన్నట్లుగా వుంది.
2016 ఏప్రిల్ లో దేశం విడిచి లండన్ వెళ్లిపోయిన మాల్యా.. ఉన్నఫళంగా ఇలా ట్వీట్లతో తాను మంచివాడిని అని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేశారన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. ఎన్నికల వేళ విజయ్ మాల్యా సహా పలువురు రుణాల ఎగవేతదారులు విపక్షాలకు ప్రచారాస్త్రాలుగా మారారు. దీంతో వీరు విదేశాల నుంచే తాము ఎగవేతదారులం కాదంటూ ఇలా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తుంటారన్న విమర్శలు కూడా వున్నాయి.
ఇక మాల్యాపై మనీలాండరింగ్ కేసు నమోదవడంతో మాల్యా లండన్ కోర్టులో విచారణను ఎదుర్కోంటున్నారు. మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై అక్కడి వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా వరుస ట్వీట్లలో తెలిపారు. తనదాకా వస్తే ఇలా వుంటుందని.. మాల్యా విషయం మరోమారు రుజువుచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more