తెలంగాణలో ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు. అసలేం జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ముగిసి దాదాపుగా 27 గంటలు గడుస్తున్నా పోలింగ్ శాతంపై ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు క్లారిటీ రాలేదు. ఈవీఎంలను భద్రపర్చడం ముగిసిన తరువాత కూడా ఇంకా లెక్క తేలకపోవడంతో అసలేం జరుగుతుందన్న అనుమానాలు కూడా రాజకీయ పార్టీల్లో రేగుతుంది. ఎన్నికలను సజావుగా జరిపించామని చెబుతున్న అధికారులు.. ఎన్నికల శాతంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
ఇప్పటికీ ఇంకా పలు జిల్లాల నుంచి ఎన్నికల సంఘానికి ఎన్నికల శాతం నమోదుపై సమాచారం అందలేదని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి రజత్‌కుమార్ తెలిపడం.. ఎన్నికల నిర్వహణ లోపాలను వేలెత్తి చూపుతుంది. అయితే తమ వద్ద ఉన్న సమాచారం మేరకు 70 శాతం పోలింగ్ జరిగినట్లు చెప్పిన రజత్.. మరికొన్ని ప్రాంతాల నుంచి రిపోర్ట్ వస్తే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చునని వెల్లడించారు. మానిటరింగ్ సెల్ లో రజత్‌కుమార్ కసరత్తు చేస్తున్నారు. ఈవీఎంలను కౌంటింగ్ కోసం స్ట్రాంగ్ రూంలకు తరలించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
119 నియోజకవర్గాలకుగానూ 55,329 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. తొలి సారిగా వీవీప్యాట్ పద్ధతిని అవలంభించారు. దీనిద్వారా ఓటు వేసిన తర్వాత తాము ఎవరికి ఓటు వేశామో ఓటర్లకు 7 సెకన్లపాటు స్లిప్ కనిపించి, ఆపై బాక్స్‌లో పడుతుంది. ఈ ఎన్నికల్లో 42,751 వీవీప్యాట్లను వినియోగించారు. వీటి కోసం దాదాపు 39 వేల కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఐటీ పరిజ్ఞానం విఫలమైందన్న వాదన తెరపైకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఓట్ల లెక్కింపు విషయంపై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈవీఎంలను కంట్రోల్ రూమ్ ఎలా మేనేజ్ చేసింది, వారి పనితీరు వల్లే పోలింగ్ శాతం తేలలేదని చెబుతున్నారు. మాస్ పోలింగ్‌లో సరైన అవగాహన లేదు. ఒక్క నియోజకవర్గంలో 20 మంది అభ్యర్థులు, నోటాతో కలిపి 21 ఆప్షన్లు ఉంటాయి. దాదాపు ఇద్దరు ఏజెంట్లు ఉంటే.. ఉదయం ఆరున్నర గంటలకు మాస్ పోలింగ్ చేశాక, 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. కానీ ఎన్నికల ఏజెంట్లకు, అధికారులకు సరైన అవగాహన లేక సమస్యలు తలెత్తాయి. సాంకేతిక పరంగా అవగాహన లేకపోవడంతో 24 గంటలు గడిచినా పోలింగ్ శాతం తేలని పరిస్థితి తలెత్తింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more