అమ్మాయిల ట్రాఫికింగ్ రాకెట్ కు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెగిన పేగు బంధం అరకముందే ఆడశిశువును తల్లికి దూరం చేసి అరవై వేల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్ తో పాటుగా బిడ్డను కొన్న జంటను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అమ్మాయిలను విదేశాలకు తరలించే ట్రాఫికింగ్ ముఠాతో చేతులు కలిపిన నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు.
పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ఆసుపత్రికి పదిరోజుల పదికందును తీసుకుని వచ్చిందో జంట. ఆ ఆడశిశువు అనారోగ్యంగా ఉండడంతో బర్త్ సర్టిఫికెట్ చూపించాలని కోరారు వైద్యులు. అయితే వారి దగ్గర అలాంటివేమో లేకపోవడం.. అస్పత్రివర్గాలు అడిగిన ప్రశ్నలకు ఆ జంట వేర్వేరు సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో భారీ ట్రాఫికింగ్ రాకెట్ గుట్టురట్టైంది. హబ్రాలోని అశోక్ నగర్ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పుట్టిన పిల్లలను ట్రాఫికింగ్ ద్వారా వేరే ప్రాంతాలకు చేరవేస్తున్నట్టు తేల్చారు. ఆ నర్సింగ్ హోమ్ నుంచి తీసుకున్న బిడ్డకు అనారోగ్యం కలగడంతో హబ్రా ఆసుపత్రికి వచ్చినట్టు తేలింది. అప్పుడే పుట్టిన మరో ఆడబిడ్డను రూ. 60వేల రూపాయలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నట్టు తేల్చారు.
శిశువు తల్లిదండ్రులుగా నటిస్తూ ఈ జంట పసికందును అసుపత్రికి తీసుకువచ్చారు. అయితే శిశువు తల్లిదండ్రులు ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాజమాన్యానికి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నర్సింగ్ హోమ్‌లో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర అమ్మకానికి ట్రాఫికింగ్ ద్వారా తెచ్చిన 11 రోజుల చిన్నారిని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more