సముద్ర తీరంలో స్విమ్మింగ్ చేస్తున్న ఓ మహిళకు అత్యంత భయానక అనుభవాన్ని చవిచూసింది. అమెను ప్రాణాంతకమైన మూడు తిమింగలాలు చుట్టుముట్టాయి. అయితే అమె అదృష్టం బాగుండటంతో అమె ఎలాంటి హానికి గురికాకుండా ఒడ్డుకు చేరింది. న్యూజిలాండ్‌లోని హహేయ్ బీచ్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన డ్రోన్ కెమరాలో రికార్డయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. మహిళకు ఎదురైన అనుభవాన్ని నెట్ జనులు షేర్లు, లైకులతో వీక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. న్యూజీలాండ్ లోని హహేయ్ ప్రాంతానికి చెందిన జుడీ జాన్సన్ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే హహేయ్ బీచ్ లోని సముద్రతీరంలో ఈత ప్రాక్టీస్ చేస్తోంది. ఇంతలో మూడు తిమింగలాలు ఆమెను చుట్టుముట్టాయి. తొలుత వీటిని డాల్ఫిన్లుగా భావించిన జుడీ జాన్సన్...వాటితో కలిసి ఈతకొడుతూ ఎంజాయ్ చేసింది. చివరకు అవి ప్రమాదకర తిమింగలాలుగా తెలుసుకుని భయభ్రాంతికి గురైయ్యింది. ఒక్కసారిగా అమెకు గుండె అగినంత పనైంది.
అవి దాడి చేసే అవకాశం ఉండడంతో వెంటనే అప్రమత్తమైన జుడీ జాన్సన్...సముద్ర నీటిలో నుంచి ఒడ్డుకు వచ్చేసింది. ఆ తరువాత అవి కూడా తనను సరదాగా అడుకుంటున్నాయని తెలిసి మళ్లీ సముద్రంలో తన ఈత ప్రాక్టీసును చేసింది. ఇక తన ఈత ముగిసిన తరువాత అమె ఒడ్డుకు చేరింది. ఈ మొత్తం తతంగాన్ని ఓ పర్యాటకుడికి చెందిన డ్రోన్ కెమరా రికార్డు చేసింది. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎదురయ్యే అనుభవంగా జుడీ జాన్సన్ పేర్కొంది.
మరణం అంచుల వరకు వెళ్లినట్టు అనిపించినా.. వాటితో కలసి ఈత కొట్టడం తనకు ఎంతో ధ్రిల్లింగ్ గా వుందని చెప్పింది. తనతో ఈత కోట్టిన తిమింగలాల్లో ఒకటి తల్లిగా, మరో రెండు పిల్లలుగా వున్నాయని తెలిపింది. అయితే సహజంగా సముద్రంలో సంచరించే సీల్స్, సీ లయన్స్‌పై దాడి చేసి ఆరగించే ప్రాణాంతక తిమింగలాలు... మనుషులపై మాత్రం అరుదుగానే దాడి చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more