తమిళ హీరో, సినీ నిర్మాత విశాల్ ను తమిళనాడు పోలీసుల అదుపులోకి తీసుకన్నారు. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TNFPC) కార్యాలయానికి తాళం వేసివున్నా బలవంతంగా తలుపును తెరిచేందుకు ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తైనాంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో తమిళనాడులో నిర్మాతల మండలి మధ్య స్టార్ వార్ ప్రారంభమైంది.
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పై గత కొన్నాళ్లుగా కొందరు నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కేవలం పెద్ద నిర్మాతలకు మద్దతుగా వహిస్తున్నారని తమను పట్టించుకోవడం లేదని చిన్న నిర్మాతలు అసంతృప్తితో వున్నారు. ఈ క్రమంలో హీరో, నిర్మాత విశాల్ నిర్ణయాలు ఏకపక్షంగా వున్నాయంటూ విమర్శించారు. తాజాగా ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు నిర్మాత మండలిలోని యాభై మంది నిర్మాతలు టీఎన్ఎఫ్పీసీ ఎదురుగా ధర్నాకు దిగారు.
సినిమాల విడుదల విషయంలో చిన్న నిర్మాతలకు విశాల్ నుంచి ఏమాత్రం సహకారం అందడం లేదని, ఆయన వల్ల చిన్న సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి లేకుండా పోయిందంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాతల మండలి ఆఫీస్ కు తాళం వేసి.. ఆ తాళం చెవిని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టీఎన్ఎఫ్పీసీ కార్యాలయానికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఆఫీస్ లోకి వెళ్లడానికి ప్రయత్నించిన విశాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
విశాల్ తో పాటు అతని అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాళం తొలగించే క్రమంలో విశాల్ వ్యతిరేక వర్గం అయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విశాల్ సహా అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తాళం తెరవాలని పోలీసులతో విశాల్ వాగ్వాదానికి దిగారు. కానీ దానికి పోలీసులు అంగీకరించలేదు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా తన కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు తనను అడ్డుకున్నారని విశాల్ అన్నారు. తనను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more